దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కొత్తగా 70,589 మందికి పాజిటివ్‌గా తేలింది. ఒక్క రోజు వ్యవధిలో 776 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 6,145,291కి చేరింది. వైరస్ బారిన పడిన వారిలో 51,01,397 మంది కోలుకున్నారు.
దేశంలో తగ్గిన కేసులు.. కొత్తగా 70,589 మందికి కరోనా - కరోనా కేసులు
దేశంలో కరోనా కేసుల సంఖ్య 61,45,291కి చేరింది. కొత్తగా 70,589 కేసులు నమోదు కాగా.. మరో 776 మంది వైరస్‌కు బలయ్యారు. మొత్తం మరణాల సంఖ్య 96,318కి చేరింది. కోలుకున్న వారి సంఖ్య 51,01,397కి పెరిగింది. కొత్త కేసుల కంటే రికవరీల సంఖ్యే ఎక్కువగా ఉంది.
కరోనా కేసులు
కొత్తగా నమోదైన కేసుల కంటే రికవరీలే అధికంగా ఉన్నాయి. ఒక్క రోజే 84,877 మంది కోలుకున్నారు.
గత నెల రోజుల్లో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్యలో దాదాపు 100 శాతం వృద్ధి నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. మొత్తం బాధితుల్లో 83 శాతం కోలుకున్నట్లు వెల్లడించింది.
Last Updated : Sep 29, 2020, 9:28 AM IST