తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సైన్యానికి చలి నుంచి రక్షణ కల్పించేందుకు..

చలికాలం ప్రారంభమైన నేపథ్యంలో సరిహద్దుల్లోని సైన్యం భద్రతకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. బలగాల కోసం అతి శీతల వాతావరణంలో ధరించే దుస్తులను అమెరికా నుంచి తెప్పించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

India receives extreme cold weather clothing from US
సైన్యానికి చలి నుంచి రక్షణ కల్పించేందుకు..

By

Published : Nov 3, 2020, 9:41 PM IST

భారత్, చైనా సరిహద్దులో కొన్ని నెలలుగా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. చలికాలం ప్రారంభమై రానున్న రోజుల్లో చలి తీవ్రత పెరగనుండగా.. భారత సైన్యం భద్రతకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. బలగాల కోసం అతి శీతల వాతావరణంలో ధరించే దుస్తులను అమెరికా నుంచి తెప్పించినట్లు సంబంధిత వర్గాలు మీడియాకు వెల్లడించాయి. 'మొదటగా కొద్ది మొత్తంలో అతి శీతల వాతావరణ పరిస్థితుల్లో వాడే దుస్తులు అమెరికా భద్రతా దళాల నుంచి భారత్‌కు చేరాయి. వాటిని మన సైన్యం ఇప్పటికే వినియోగిస్తోంది' అని తెలిపాయి.

సియాచిన్, తూర్పు లద్దాఖ్ సెక్టార్‌ సహా లద్దాఖ్ ప్రాంతమంతా మోహరించిన దళాల కోసం భారత సైన్యం 60,000 మందికి సరిపడా ఈ తరహా దుస్తులను ముందుగానే నిల్వ చేస్తుందని ఆ వర్గాలు వెల్లడించాయి. ఈ సంవత్సరం, మరో 30,000 మంది కోసం అదనపు అవసరం ఏర్పడిందన్నాయి. సరిహద్దు ప్రాంతంలో చైనా ఆర్మీ దుందుడుకు చర్యలను దృష్టిలో ఉంచుకొని సుమారు 90,000 మంది సైనికులను మోహరించాల్సిన పరిస్థితి ఎదురైందని... దీంతో అత్యవసరంగా ఈ దుస్తులను తెప్పించడం వల్ల అత్యంత శీతల పరిస్థితుల్లో కూడా సైన్యం తట్టుకొని నిలబడి ఉండటానికి దోహదం చేస్తుందని పేర్కొన్నాయి. అంతేకాకుండా ప్రత్యేక దళాల కోసం అమెరికా నుంచి రైఫిళ్ల వంటి కొన్ని ఆయుధాలను కూడా భారత్ తెప్పిస్తోంది.

ఇదీ చూడండి:అమెరికా అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికైతే భారత్​కు లాభం?

ABOUT THE AUTHOR

...view details