తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తీవ్రమైన ఆకలి దేశంగా భారత్​.. ర్యాంక్​ ఎంతంటే? - International Hunger report news

దేశంలో ఆకలి కేకలు నిత్యం పెరిగిపోతున్నాయి. ప్రపంచ ఆకలి సూచీ.. ఈ ఏడాది విడుదల చేసిన ర్యాంకుల్లో 94వ స్థానంలో నిలిచింది భారత్​. అంతేకాకుండా దేశవ్యాప్తంగా అనేక మంది పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారని ఈ గణాంకాలు వెల్లడించాయి.

India ranks 94 in Hunger Index; experts blame poor implementation, siloed approach
'తీవ్రైమైన ఆకలి బాధలున్న దేశాల కేటగిరీలో భారత్​'

By

Published : Oct 17, 2020, 4:58 PM IST

దేశంలో ఆకలి కేకలు నానాటికి పెరుగుతూనే ఉన్నాయి. 107 దేశాల ప్రపంచ ఆకలి సూచీ-2020లో భారత్‌ 94 వ స్థానంలో ఉండి.. తీవ్రమైన ఆకలి బాధలు ఉన్న దేశాల కేటగిరీలో నిలిచింది. పొరుగు దేశాలైన బంగ్లాదేశ్‌, మయన్మార్‌, పాకిస్థాన్‌ ఇదే కేటగిరీలో ఉన్నప్పటికీ.. భారత్‌ కంటే మెరుగైన ర్యాంకులో నిలిచాయి.

ఆకలి సూచీలో బంగ్లాదేశ్‌-75, మయన్మార్‌-78, పాకిస్థాన్‌-88వ స్థానంలో ఉన్నాయి. నేపాల్‌-73, శ్రీలంక-64 వ స్థానంలో నిలిచాయి. చైనా, బెలారస్‌, ఉక్రెయిన్‌, టర్కీ, క్యూబా, కువైట్‌ సహా.. మొత్తం 17 దేశాలు సంయుక్తంగా మొదటి స్థానంలో ఉన్నట్టు ప్రపంచ ఆకలి సూచీ వెబ్‌సైట్‌ వెల్లడించింది.

పోషకాహార లోపంతో..

ఈ వెబ్‌సైట్‌ వెల్లడించిన వివరాల ప్రకారం.. భారత జనాభాలో 14శాతం పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. దేశంలో ఐదేళ్లలోపు పిల్లల్లో 37.4శాతం మంది వయస్సుకు తగ్గ ఎత్తు పెరగడం లేదు. 17.3 శాతం మంది ఎత్తుకు తగ్గ బరువు తూగడం లేదు. మరోవైపు ఐదేళ్లలోపు పిల్లల్లో మరణాల శాతం 3.7 శాతంగా ఉన్నట్లు గణించింది ప్రపంచ ఆకలి సూచీ వెబ్‌సైట్‌. సంక్షేమ కార్యక్రమాల అమలులో నిర్లక్ష్యం, సరైన పర్యవేక్షణ లేకపోవడం, పెద్ద రాష్ట్రాల నిరాజనక ప్రదర్శన, పోషకాహర లోపాన్ని అరికట్టడంలో వైఫల్యమే.. ఈ దుస్థితికి కారణమని నిపుణులు అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి:కొవిడ్‌ చికిత్సా విధానం.. పునరాలోచనలో భారత్‌!

ABOUT THE AUTHOR

...view details