భారత విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్ , పాకిస్థాన్ సమాచార మంత్రి ఫవాద్ చౌదరికి మధ్య మాటల యుద్ధం జరిగింది. హోలీ రోజున హిందూ మతానికి చెందిన ఇద్దరు యువతుల్ని పాకిస్థాన్‌లోని సింధ్ ప్రాంతంలో బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చటమే ఈ మాటల యుద్ధానికి ప్రధాన కారణం.
ఈ బలవంతపు మత మార్పిళ్లపై భారత రాయబారి అజయ్ బిసరియా నుంచి నివేదిక కోరినట్లు ట్వీట్ చేశారు సుష్మా. ఈ ట్వీట్‌పై స్పందించారు పాకిస్థాన్ సమాచార మంత్రి ఫవాద్ చౌదరి.
" ఇది పాకిస్థాన్ అంతర్గత విషయం. మైనార్టీలను అణగదొక్కుతున్న మోదీ భారత్ కాదని గుర్తించాలి. ఇది ఇమ్రాన్ ఖాన్ నయా పాక్, మా జెండాలోని తెల్ల రంగు సమానత్వాన్ని సూచిస్తుంది. భారతీయ మైనార్టీల విషయంలోనూ ఇంతే శ్రద్ధతో వ్యవహరిస్తారని ఆశిస్తున్నాను" - ఫవాద్ చౌదరి, పాక్ మంత్రి
ఈ ట్వీట్‌కు స్పందించిన సుష్మ తను కేవలం బలవంతపు మత మార్పిడిపై నివేదిక మాత్రమే అడిగానని , కాని పాక్ మంత్రి స్పందన చూస్తే వారు తప్పు చేసినట్లు స్పష్టమవుతోందని సుష్మ వ్యాఖ్యానించారు.