తెలంగాణ

telangana

By

Published : Apr 28, 2020, 7:21 AM IST

ETV Bharat / bharat

చైనా ర్యాపిడ్ టెస్ట్ కిట్ల కొనుగోళ్లు రద్దు- కారణం ఇదే

చైనా నుంచి దిగుమతి చేసుకున్న ర్యాపిడ్ యాంటీబాడీ టెస్ట్ కిట్లను కేంద్రం రద్దు చేసింది. ఈ కిట్లు సరిగా పనిచేయవని తేలిన నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. చెల్లింపులేవీ జరపని కారణంగా.. చైనా కిట్లను రద్దు చేయడం వల్ల ఎలాంటి నష్టం లేదని స్పష్టం చేసింది కేంద్రం.

CHINA KITS
చైనా కిట్లు

చైనా నుంచి తెప్పించిన ‘ర్యాపిడ్‌ యాంటీబాడీ టెస్ట్‌’ కిట్లు సరిగా పనిచేయడం లేదని తేలిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఆ దేశానికి చెందిన గాంగ్ఝౌ ఓన్‌డ్ఫో బయోటెక్‌, జుహాయ్‌ లివ్‌జాన్‌ డయాగ్నోస్టిక్స్‌ సంస్థలకు ఇచ్చిన ఆర్డర్లను రద్దు చేసుకుంది.

ఈ ఆర్డర్ల రద్దు వల్ల ప్రభుత్వంపై ఒక్క రూపాయి కూడా నష్టం ఉండబోదని స్పష్టం చేసింది. ఇప్పటివరకు ఆయా సంస్థలకు చెల్లింపులేవీ జరపలేదని వెల్లడించింది. ఇప్పటికే భారత్‌కు చేరుకున్న కిట్లను వెనక్కి పంపిస్తామని తెలిపింది.

పాత పద్ధతే మేలు..

మరోవైపు, చైనా సంస్థలు సరఫరా చేసిన కిట్ల వినియోగాన్ని నిలిపేయాలని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) సోమవారం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది. ఈ కిట్ల ద్వారా చేస్తున్న వైద్య పరీక్షల్లో భారీ తేడాలు వస్తున్నట్టు ఐసీఎంఆర్‌ అదనపు డైరెక్టర్‌ జనరల్‌ జీఎస్‌ తొతేజా పేర్కొన్నారు. కొవిడ్‌-19 నిర్ధారణ కోసం ముక్కు, గొంతుల నుంచి సేకరించే స్రావాల ఆధార ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలే ఉత్తమమని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:కరోనా రాపిడ్ టెస్ట్​ కిట్ల వినియోగం బంద్!

ABOUT THE AUTHOR

...view details