లాక్డౌన్ సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నారు భారత తపాలా శాఖ అధికారులు. ఉత్తరాలతో పాటు మాస్కులు, ఔషధాలను డోర్ డెలివరీ చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం 'పోస్ట్ఇన్ఫో' మొబైల్ యాప్లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ యాప్ ద్వారా వినియోగదారుల అభ్యర్థన మేరకు సాధారణ సేవలతో పాటు ఔషధాలు, మాస్కులను అందిస్తామని వెల్లడించారు.
"ఈ యాప్ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్ ఓపెన్ చేసి వారికి ఏమి కావాలో రిక్వెస్ట్ పంపాలి. ఆ తర్వాత మొబైల్కు ఒక రిఫరెన్స్ నంబర్ వస్తుంది. ఈ నంబర్ ద్వారా వారు ఆర్డర్ చేసిన వస్తువు ఎక్కడుందో తెలుసుకోవచ్చు."