తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రోదసిపై సొంత అంతరిక్ష కేంద్రం: ఇస్రో

చంద్రయాన్​-2 ప్రయోగ తేదీని ప్రకటించిన భారత అంతరిక్ష కేంద్రం ఇస్రో.. మరిన్ని కీలక ప్రాజెక్టులకు సంకల్పించింది. రోదసిపై భారత్​ సొంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు ఇస్రో ఛైర్మన్​ కె. శివన్​. అంతరిక్షంపైకి మనిషిని పంపే ప్రాజెక్టును చేపట్టనున్నట్లు ప్రకటించారు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్​.

By

Published : Jun 13, 2019, 5:24 PM IST

Updated : Jun 13, 2019, 7:43 PM IST

రోదసిపై సొంత అంతరిక్ష కేంద్రం: ఇస్రో

రోదసిపై సొంత అంతరిక్ష కేంద్రం: ఇస్రో

భారత అంతరిక్ష కేంద్రం ఇస్రో.. త్వరలో కీలక ప్రాజెక్టులు చేపట్టేందుకు సిద్ధమైంది. ఇప్పటికే చంద్రయాన్​-2 ప్రయోగానికి ముహూర్తం ఖరారు చేసింది. జులై 15న అంతరిక్షంలోకి స్పేస్​క్రాఫ్ట్​(వాహక నౌక)ను పంపనుంది ఇస్రో.

రోదసిలో సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తోంది ఇస్రో. ఈ విషయాన్ని స్వయంగా ఇస్రో ఛైర్మన్​ కె.శివన్ విలేకరులకు వెల్లడించారు. ప్రతిష్టాత్మక గగన్​యాన్​ ప్రాజెక్టుకు కొనసాగింపుగా ఈ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు.

జులై 15న ప్రయోగించనున్న చంద్రయాన్​-2 ప్రాజెక్టు.. చంద్రయాన్​-1కు కొనసాగింపు అని అణుశక్తి, అంతరిక్ష శాఖ కేంద్ర సహాయ మంత్రి డా. జితేంద్ర సింగ్ తెలిపారు. సెప్టెంబర్​లో లక్ష్యాన్ని చేరుతుందని వెల్లడించారు.

ఇదీ చూడండి:ఏఎన్​-32 విమానంలో గల్లంతైన వారంతా మృతి

రోదసిపై తొలి మనిషిని పంపే ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ఇస్రో నాంది పలకనున్నట్లు ప్రకటించారు జితేంద్ర సింగ్​. పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో ఈ ప్రాజెక్టును నిర్వహించనున్నట్లు పేర్కొన్న ఆయన.. దీని కోసం రూ. 10 వేల కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపారు.

''2022లో భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని.. అంతరిక్షంపైకి ఇస్రో తొలి మనిషిని పంపే కార్యక్రమం చేపట్టనుంది. 2022కు ముందు లేదా.. ఆ సంవత్సరంలోనే ప్రయోగం నిర్వహించే అవకాశముంది. ఈ ప్రాజెక్టులో ఇద్దరు లేదా ముగ్గురు వ్యోమగాములు ఉంటారు. దీని పర్యవేక్షణ కోసం.. ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయనున్నాం. గగన్​యాన్​ జాతీయ సలహా మండలి విభాగం ఈ కార్యక్రమం ప్రణాళిక, ఏర్పాట్లను పర్యవేక్షిస్తుంది. ''

- జితేంద్ర సింగ్​, అణు శక్తి, అంతరిక్ష శాఖ కేంద్ర సహాయ మంత్రి

Last Updated : Jun 13, 2019, 7:43 PM IST

ABOUT THE AUTHOR

...view details