కర్తార్‌పుర్ నడవా నిర్మాణంపై భారత్-పాక్ అధికారులు మరోసారి సమావేశమయ్యారు. అఠారీ-వాఘా సరిహద్దులో ఈ భేటీ జరుగుతోంది. భద్రతా పరమైన అంశాలతో పాటు ప్రత్యేక సందర్భాల్లో నడవా ద్వారా ఎంతమంది భక్తులను అనుమతించాలన్న అంశాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. నడవా విధివిధానాలు, సాంకేతిక సమస్యలపైనా చర్చించే అవకాశం ఉంది.
ఎక్కువ భాగం పాక్‌లోనే..
కర్తార్‌పుర్ నడవా నిర్మాణం పూర్తయితో పంజాబ్ గురుదాస్‌పుర్ నుంచి... సిక్కులు అత్యంత పవిత్రమైన ప్రాంతంగా భావించే పాకిస్థాన్ కర్తార్‌పుర్‌లోని గురుద్వారా దాదర్ సాహిబ్‌కు నేరుగా రాకపోకలు సాగించొచ్చు. అయితే నడవా ఎక్కువ భాగం పాక్ భూభాగంలో ఉండనుంది. అందువల్ల వరదలను కూడా తట్టుకునేలా నడవాను నిర్మించాలని పాక్‌కు సూచిస్తోంది భారత్.