తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కరోనా రికవరీల్లో ప్రపంచంలోనే భారత్​ టాప్​' - ఇండియా బ్రెజిల్​ కరోనా రికవరీలు

దేశంలో కరోనా​ విజృంభిస్తున్నప్పటికీ... వైరస్​ను జయిస్తున్న వారి సంఖ్య కూడా రికార్డు స్థాయిలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రపంచవ్యాప్తంగా కరోనా రికవరీల్లో అగ్రస్థానానికి చేరుకుంది భారత్​. ఇప్పటివరకు ఆ స్థానంలో ఉన్న బ్రెజిల్​ను వెనక్కి నెట్టిందని జాన్స్​ హాప్​కిన్స్​ విశ్వవిద్యాలయం వెల్లడించింది.

India overtakes Brazil to record highest number of COVID-19 recoveries in world: Johns Hopkins data
కరోనా రికవరీల్లో ప్రపంచంలోనే భారత్​ టాప్​

By

Published : Sep 14, 2020, 3:14 PM IST

Updated : Sep 14, 2020, 4:13 PM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా రికవరీల్లో అగ్రస్థానానికి చేరుకుంది భారత్​. సోమవారం నాటికి రికవరీల సంఖ్య 37,80,107 చేరడం వల్ల.. ఇప్పటివరకు అగ్రస్థానంలో ఉన్న బ్రెజిల్(37,23,206)​ను భారత్​ వెనక్కి నెట్టిందని జాన్స్​​ హాప్​కిన్స్​ విశ్వవిద్యాలయం గణాంకాల ద్వారా తెలిసింది.

ప్రపంచ దేశాల్లో ఇప్పటివరకు 2,90,06,033 కేసులు వెలుగుచూశాయి. 9,24,105మంది కరోనా ధాటికి బలయ్యారు. అయితే ప్రపంచవ్యాప్తంగా 1,96,25,959మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. భారత్​లో ఆదివారం 92,071 వేల కొవిడ్-19 కేసులు, 1,136 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసులు 48 లక్షలు దాటగా.. మృతులు 80వేలకు చేరువయ్యాయి.

దేశంలో రికవరీ రేటు 78శాతానికి చేరిందని భారత ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్​ వెల్లడించారు. యాక్టివ్​- రికవరీ కేసుల మధ్య వ్యత్యాసం కూడా గణనీయంగా పెరుగుతోందన్నారు. దేశంలో 60 శాతం కొవిడ్-19 కేసులు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఉత్తర్​ప్రదేశ్​ నుంచే వస్తున్నట్లు వివరించారు.

ఇదీ చూడండి:-కరోనా కాలంలో సరికొత్తగా పార్లమెంటు సమావేశాలు

Last Updated : Sep 14, 2020, 4:13 PM IST

ABOUT THE AUTHOR

...view details