ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్... జమ్ము కశ్మీర్, లద్ధాఖ్ అంశాలు ప్రస్తావించడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇవి రెండూ భారత అంతర్భాగాలని తేల్చిచెప్పింది.
"ఆర్టికల్ 370 రద్దు సహా జమ్ము కశ్మీర్లో ఇటీవల జరిగిన పరిణామాలు.. పూర్తిగా భారత అంతర్గత విషయాలు. భారతదేశ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను ఇతర దేశాలు (చైనా) గౌరవిస్తాయని ఆశిస్తున్నాం."- రవీశ్‌కుమార్, భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి.
ఐరాస సర్వసభ్య సమావేశంలో మాట్లాడిన చైనా విదేశాంగమంత్రి వాంగ్.. కశ్మీర్, లద్ధాఖ్ అంశాలను లేవనెత్తారు. ఐరాస, భద్రతామండలి తీర్మానాలు, ద్వైపాక్షిక చర్చలు ద్వారా జమ్ము కశ్మీర్ సమస్యను భారత్, పాక్ సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఉచిత సలహాలు ఇచ్చారు.