విద్యుత్తు రంగానికి సైబర్ దాడుల ముప్పు పొంచి ఉందని, అందుకే చైనా, పాకిస్థాన్ విద్యుత్తు పరికరాలను దిగుమతి చేసుకోబోమని కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి ఆర్‌కే సింగ్ తెలిపారు. ఈ పరికరాల్లో ప్రవేశపెట్టిన మాల్‌వేర్ ద్వారా దేశంలోని పవర్‌గ్రిడ్‌ను బంద్ చేసే అవకాశం ఉంటుందని చెప్పారు.
'చైనా, పాక్ విద్యుత్తు పరికరాలు దిగుమతి చేసుకోం' - సైబర్ దాడులు
విద్యుత్తు రంగంపై సైబర్ దాడులు జరుగుతాయన్న అనుమానాల నేపథ్యంలో చైనా, పాకిస్థాన్ విద్యుత్తు పరికరాలను దిగుమతి చేసుకోబోమని వెల్లడించారు కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి ఆర్‌కే సింగ్. రాష్ట్రాల డిస్కంలు కూడా చైనా సంస్థలకు ఆర్డర్లు ఇవ్వొద్దని కోరినట్లు తెలిపారు.
చైనా, పాక్ విద్యుత్తు పరికరాలు దిగుమతి చేసుకోం
విద్యుత్తు చట్ట సవరణ ముసాయిదాపై రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలు తెలుసుకొనేందుకు శుక్రవారం వీడియోకాన్ఫరెన్స్ ద్వారా పలువురు ముఖ్యమంత్రులు, విద్యుత్తు మంత్రులతో ఆయన సమావేశమయ్యారు. అనంతరం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రాల డిస్కంలు కూడా చైనా సంస్థలకు ఆర్డర్లు ఇవ్వొద్దని కోరినట్టు చెప్పారు.
ఇదీ చూడండి:బిహార్లో పిడుగులకు మరో 13 మంది బలి