తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'సెప్టెంబరు మొదటివారంలో తీవ్ర స్థాయికి కరోనా' - center must control corona

భారత్​లో కరోనా మహమ్మారి సెప్టెంబరు మొదటి వారంలో అత్యంత తీవ్ర స్థాయికి చేరుకుంటుందని ప్రముఖ ఆరోగ్య నిపుణులు డా.గిరిధర్ గ్యాని చెప్పారు. ఈటీవీ భారత్​తో ప్రత్యేక ముఖాముఖిలో పాల్గొన్న ఆయన.. కరోనాతో కలిసి జీవించక తప్పదని ప్రజలకు అర్థమైందని పేర్కొన్నారు. జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వైరస్​ను కట్టడి చేయడం అత్యంత ఆవశ్యకమన్నారు.

India may witness peak of COVID-19 cases in September: Health expert
'సెప్టెంబరు మొదటి వారంలో తీవ్ర స్థాయికి కరోనా'

By

Published : Aug 22, 2020, 12:22 PM IST

రోజువారీగా కరోనా కేసుల్లో ప్రస్తుతం ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది భారత్. రోజూ సగటున 65వేలకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. సెప్టెంబరు మొదటి వారంలో కరోనా కేసుల సంఖ్య అత్యంత తీవ్రస్థాయికి చేరుతుందని తెలిపారు ప్రముఖ ఆరోగ్య నిపుణులు, అసోసియేషన్​ ఆఫ్​ హెల్త్​కేర్ ప్రొవైడర్స్ ఇండియా డైరెక్టర్ జనరల్ డాక్టర్ గిరిధర్ గ్యాని. ఈటీవీ భారత్​తో ప్రత్యేక ముఖాముఖిలో పాల్గొన్న ఆయన.. పలు కీలక విషయాలు వివరించారు. ఈ దశకు చేరుకున్న అనంతరం.. క్రమంగా కేసులు తగ్గుముఖం పడతాయని వివరించారు.

వైరస్ వ్యాప్తి​ గొలుసును తెంచేందుకు కేంద్రం మరిన్ని చర్యలు చేపట్టాల్సిన అవసరముందన్నారు గ్యాని. జనసాంద్రత ఎక్కువగా ఉన్న ఉత్తర్​ప్రదేశ్, బిహార్ వంటి రాష్ట్రాల్లో వైరస్​ను కట్టడి చేయాలన్నారు. కరోనాతో సహజీవనం చేయాల్సిందేనని దేశ ప్రజలకు అర్థమైందన్నారు.

ఈటీవీ భారత్​తో ప్రత్యేక ముఖాముఖి

"రోజుకు దాదాపు 65వేల కేసులు, 900వరకు మరణాలు నమోదవుతున్నాయి. ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక ప్రకారం సెప్టెంబరు మొదటి వారంలో కరోనా కేసులు అత్యధిక స్థాయిలో వెలుగుచూస్తాయి. మహారాష్ట్ర(ముంబయి), తమిళనాడు(చెన్నై), దిల్లీలు ఇప్పటికే ఈ స్థాయిని అధిగమించాయి. అక్కడ కేసుల సంఖ్య ఉచ్ఛ స్థితి(పీక్​)కి చేరి ఇప్పుడు తగ్గుతోంది. ఉత్తర్​ప్రదేశ్​, మధ్యప్రదేశ్​, పశ్చిమ్​ బంగా, ఛత్తీస్​గఢ్​లో ఇప్పుడిప్పుడే కేసులు పెరుగుతున్నాయి. సెప్టెంబరు మొదటి వారం తర్వాత కూడా ఆ రాష్ట్రాల్లో కేసులు విపరీతంగా పెరుగుతాయి. అక్కడ మౌలిక సదుపాయాలు సరిగ్గా లేవు. ఆ రాష్ట్రాల్లో విజయవంతంగా కరోనాను కట్టడి చేస్తే ఈ ఏడాది చివరి నాటికి దేశం మహమ్మారిని అధిగమిస్తుందనే నమ్మకం ఉంది."

-డాక్టర్ గిరిధర్ గ్యాని.

దిల్లీలో సీరో సర్వే ప్రకారం 30శాతం మందికి పైగా ప్రజల్లో కరోనాను ఎదుర్కొనే రోగనిరోధక శక్తిని గుర్తించారు. దీనిపై స్పందించారు డాక్టర్​ గ్యాని. చాలా మంది ఇప్పటికే రోగ నిరోధక శక్తిని పొందినట్లు నివేదిక స్పష్టం చేస్తోందన్నారు. మరో ఆరు నెలల్లో ఇంకా ఎక్కవ మంది పొందుతారన్నారు. వైరస్​ వ్యాప్తిని ప్రజలు అర్థం చేసుకున్నారని, వైద్య సాంకేతికత అభివృద్ధి చెందిందన్నారు. కేంద్రం దిల్లీలో కరోనాను కట్టడి చేసేందుకు జోక్యం చేసుకున్న తర్వాత దేశవ్యాప్తంగా సానుకూల ఫలితాలు వచ్చాయని గ్యాని చెప్పారు. వైరస్ ప్రభావం అధికంగా ఉన్న ఇతర రాష్ట్రాలకు దిల్లీ నుంచి నిపుణులను పంపాలని సూచించారు.

ఇదీ చూడండి: సెప్టెంబర్ సగం ముగిసేసరికి తీవ్ర స్థాయికి కరోనా!

ABOUT THE AUTHOR

...view details