పెరుగుతున్న కర్బన ఉద్గారాల కారణంగా వచ్చే 80 ఏళ్లలో భారతదేశం తీవ్రమైన వాతావరణ మార్పులకు గురవుతుందని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. తీవ్రమైన వడగాలులు, వరదలు ముంచెత్తుతాయని వెల్లడిస్తున్నాయి. 21వ శతాబ్దం ఆఖరికి అధిక కర్బన ఉద్గారాల కారణంగా వార్షిక సగటు ఉష్ణోగ్రతలు 4.2 డిగ్రీల సెల్సియస్ మేర పెరుగుతాయని సౌదీ అరేబియాలోని కింగ్ అబ్దులాజీజ్ విశ్వవిద్యాలయ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది.
ఎర్త్ సిస్టమ్ అండ్ ఎన్విరాన్‌మెంట్ అనే జర్నల్‌లో ఈ అధ్యయనం ప్రచురితమైంది.
" పెరిగిన ఉష్ణోగ్రతల కారణంగా మంచుగడ్డలు కరిగి వరదలు ముంచెత్తే ప్రమాదం వాయవ్య భారతానికి అధికంగా ఉంది. ఫలితంగా పంటలకు, జీవావరణానికి, దిగువ ప్రాంతాలలో నివశించే ప్రజలకు పెద్దఎత్తున నష్టం కలుగుతుంది. మైదాన ప్రాంతాలలో తీవ్రమైన వేడిగాలులు వీస్తాయి. ఉద్గారాల వల్ల కాలుష్యం పెరిగి అకాల వర్షాలు, ఫలితంగా వరదలు సంభవిస్తాయి. దేశ ప్రజలకు, పర్యావరణ వ్యవస్థకు, ఆర్థిక రంగానికి ఎదురయ్యే ముప్పును నివారించేందుకు కర్బన ఉద్గారాలను తగ్గించేలా.. వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది."
- మన్సూర్ అల్మజ్రౌయ్, అబ్దులాజీజ్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్.
ఇదీ చూడండి: 'అత్యధిక కాలుష్యం ఈ నాలుగు దేశాల నుంచే'