కరోనా పట్ల ప్రజల్లో నెలకొన్న భయాందోళనలను మరింత పెంచే మరో సంచలన విషయం వెల్లడైంది. 2021 శీతాకాలానికి భారత్లో రోజుకు 2.87 లక్షల కేసులు నమోదవుతాయని ఎమ్ఐటీ(మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) పరిశోధకులు హెచ్చరించారు.
2021 శీతాకాలం నాటికి.. కరోనా వైరస్ వల్ల అత్యంత దారుణంగా ప్రభావితమయ్యే దేశంగా భారత్ నిలుస్తుందని పరిశోధకులు అంచనా వేశారు. దేశంలో రోజుకు 2.87లక్షల కేసులు వెలుగుచూస్తాయన్నారు. భారత్ తర్వాత అమెరికా(95,000కేసులు), దక్షిణాఫ్రికా(21,000కేసులు), ఇరాన్(17,000కేసులు), ఇండోనేషియా(13,000కేసులు) ఉంటాయని పేర్కొన్నారు.