తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చంద్రయాన్​-3: వచ్చే ఏడాది మళ్లీ జాబిల్లిపైకి!

జాబిల్లిని మరోమారు పలకరించేందుకు సిద్ధమవుతోంది ఇస్రో. చంద్రయాన్​-2లో జరిగిన పొరపాట్లను నివారించి, చంద్రుడిపై సాఫ్ట్​ ల్యాండింగ్​ చేసే లక్ష్యంతో కసరత్తు చేస్తోంది.

చంద్రయాన్​-3: వచ్చే ఏడాది మళ్లీ జాబిల్లిపైకి!

By

Published : Nov 14, 2019, 1:45 PM IST

Updated : Nov 14, 2019, 6:43 PM IST

చంద్రయాన్​-3: వచ్చే ఏడాది మళ్లీ జాబిల్లిపైకి!
చంద్రయాన్​-3 కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ సిద్ధమవుతోందా? వచ్చే ఏడాది నవంబరే ముహూర్తమా? అవుననే అంటున్నాయి ఇస్రో వర్గాలు.

మామపైకి మరోసారి

రెండు నెలల క్రితం ప్రంపంచం ఎరుగని చంద్రుని దక్షిన ధృవంపై కాలు మోపింది చంద్రయాన్​-2. అయితే, చంద్రుని ఉపరితలానికి కాస్త దూరంలో ఉండగా ల్యాండర్​-విక్రమ్​తో సంబంధాలు తెగిపోయాయి. విక్రమ్​ మృదువుగా కాక వేగంగా వెళ్లి చంద్రుడిని ఢీకొనడం వల్లే ఇలా జరిగి ఉంటుందని అందరూ భావించారు.

అందుకే ఈసారి అలా జరగకుండా చంద్రయాన్​-2లో జరిగిన పొరపాట్లను సవరించుకుంటోంది ఇస్రో. చంద్రయాన్​-3ని మృదువుగా చంద్రుడిపై దింపేందుకు రోవర్​, ల్యాండర్​లపై మరింత శ్రద్ధ వహిస్తోందని బెంగళూరులోని విశ్వసనీయవర్గాలు తెలిపాయి.

కమిటీలు సిద్ధం

చంద్రయాన్​-3 ప్రయోగానికి అవసరమైన ప్రణాళిక తయారు చేసేందుకు తిరువనంతపురం విక్రమ్​ సారాభాయి అంతరిక్ష పరిశోధనా కేంద్రం డైరక్టర్ ఎస్​ సోమనాథ్ నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది ఇస్రో. 2020 చివరిలోపు మిషన్​ను పూర్తి చేయాలని కమిటీకి సూచించింది.

చంద్రయాన్​-2 ల్యాండింగ్​లో ఎదురైన సమస్యలను గుర్తించేందుకు లిక్విడ్ ప్రొపల్షన్స్​ సిస్టమ్స్​ సెంటర్​ డైరక్టర్ నారాయణన్ నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేసింది ఇస్రో. ఈ కమిటీ ఇప్పటికే నివేదిక అందజేసింది. ప్రధాని కార్యాలయం ఆమోదం తర్వాత ఆ వివరాలను బహిర్గతం చేసే అవకాశముంది.

నారాయణన్​ కమిటీ నివేదికను పరిగణనలోకి తీసుకుని చంద్రయాన్​-3 ప్రణాళికలు రూపొందించనున్నట్లు ఇస్రో వర్గాలు తెలిపాయి. వచ్చే ఏడాది నవంబర్​లో ప్రయోగం నిర్వహణకు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు చెప్పాయి.

ఇదీ చదవండి:జాబిల్లి కోసం: చంద్రయాన్​-1 సూపర్​ హిట్​.. కానీ...

Last Updated : Nov 14, 2019, 6:43 PM IST

ABOUT THE AUTHOR

...view details