తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశంపై ప్రేమతో ఇంటిలోనే 'ఇండియా మందిర్​' - India Mandir news

దేశంపై ఉన్న ప్రేమను వినూత్నంగా చాటుకున్నాడు కర్ణాటక ఛామరాజనగర్​కు చెందిన ఓ వ్యక్తి. తన ఇంటిలో 'ఇండియా మందిర్'​ను నిర్మించి పూజలు చేస్తూ దేశభక్తిని చాటుకుంటున్నాడు. కూలీ పనులు చేసుకునే ఆ వ్యక్తి దేశభక్తిలో ఇతరులకు ఒక నమూనాగా నిలిచాడు. మరి ఆ దేశభక్తుడు ఎవరో తెలుసుకుందాం...

India Mandir in a house of Chamarajanagar
దేశభక్తి: ఇంటిలో 'ఇండియా మందిర్​'

By

Published : Aug 15, 2020, 7:54 PM IST

దేశంపై ఉన్న ప్రేమను ఒక్కొక్కరు ఒక్కోలా చూపుతారు. స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాలు, ఇతర సందర్భాల్లో పలు కార్యక్రమాలు నిర్వహించి తమలోని దేశభక్తిని బయపెడుతుంటారు. కానీ, కర్ణాటకలోని ఛామరాజనగర్​కు చెందిన ఓ వ్యక్తి ఇంటిలోనే 'ఇండియా మందిర్'​ ఏర్పాటు చేసి తనలోని దేశభక్తిని చాటుకున్నాడు.

ఛామరాజనగర్​ తాలుక కెల్లంబల్లి గ్రామానికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు రవికుమార్​.. తన ఇంటి గోడపై ఇండియా మ్యాప్​ను ఏర్పాటు చేసుకున్నాడు. అంతేకాదు ప్రతిరోజు దానికి నమస్కరించనిదే మరో పని చేయడు. వారానికోసారి ఆ మ్యాప్​కు పూజలు నిర్వహిస్తాడు.

దేశ చిత్రపటానికి సెల్యూట్​ చేస్తోన్న రవికుమార్​

కరోనా మహమ్మారిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ విధించిన సమయంలో తన ఇంటి గోడను కూలగొట్టి కొత్తగా నిర్మించాడు రవికుమార్​. ఆ గోడలోనే భారత చిత్రపటం, జాతీయ జెండాలను ఆకృతులను నిర్మించాడు.

భారత చిత్రపటం వద్ద రవికుమార్​

రవికుమార్​ తన సొంత ఖర్చుతో సైనికుల స్మారక స్థూపాన్ని నిర్మించాలనుకున్నాడు. అదే కోరిక ఈ ఇండియా మందిర్​కు రూపునిచ్చింది. పెద్దగా చదువుకోకపోయినా.. దేశం అంటే ప్రేమ ఉన్నవారికి ఒక మోడల్​గా మారాడు.

ఇదీ చూడండి: స్వాతంత్య్ర వేడుకలు హింసాత్మకం.. భాజపా కార్యకర్త మృతి

ABOUT THE AUTHOR

...view details