భారత్‌కు మాల్దీవులు చిరకాల మిత్ర దేశమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కరోనా నేపథ్యంలో తలెత్తిన ఆరోగ్య, ఆర్థిక సంక్షోభ సమయంలో ఒకరికొకరు మద్దతుగా నిలవాలన్నారు. భారత్ అందించిన ఆర్థిక సహాయానికి కృతజ్ఞతగా మాల్దీవులు అధ్యక్షుడు ఇబ్రహీం మోహమెద్ సోలిహ్ చేసిన ట్వీట్‌కు స్పందించారు మోదీ.
"ఇరుగుపొరుగు దేశాల మధ్య స్నేహభావం ఉండాలి, కరోనా వల్ల ఏర్పడిన సంక్షోభ సమయంలో ఇరుదేశాలు ఒకరికి ఒకరు మద్దతుగా నిలవాలి."