పాకిస్థాన్ లాహోర్లోని ఓ గురుద్వారాను మసీదుగా మార్చే ప్రయత్నాలపై భారత్ తీవ్ర నిరసన తెలిపింది. భారత్లోని పాక్ హైకమిషనర్ వద్ద నిరసన వ్యక్తం చేసింది.
"లాహోర్లోని షాహిదీ అస్థాన్ గురుద్వారాను మసీదుగా మార్చే యత్నాలపై పాకిస్థాన్ హైకమిషనర్ వద్ద తీవ్ర నిరసన వ్యక్తం చేశాం. భాయ్ తారుసింగ్ జీ ప్రాణత్యాగం చేసిన ప్రదేశమైన ఈ గురుద్వారాను షాహిద్ గంజ్గా పేర్కొంటు మసీదుగా మార్చేందుకు యత్నిస్తోంది పాక్."
-అనురాగ్ శ్రీవాత్సవ, విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి