తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'సిక్కు యాత్రికులకు వీసాలు మంజూరు చేయండి'​ - షాహిదీ పురబ్​

సిక్కు యాత్రికులు 87 మందికి పొరుగుదేశం పాకిస్థాన్ వీసా మంజూరు చేయడానికి నిరాకరించడంపై భారత్​ నిరసన వ్యక్తం చేసింది. పాకిస్థాన్ రైలును అనుమతించకుండా 200 మంది యాత్రికులను భారత్ అడ్డుకుందని పాక్ ప్రత్యారోపణ చేసింది.

'సిక్కు యాత్రికులకు వీసాలు మంజూరు చేయండి': భారత్​

By

Published : Jun 15, 2019, 6:00 AM IST

Updated : Jun 15, 2019, 7:01 AM IST

'సిక్కు యాత్రికులకు వీసాలు మంజూరు చేయండి': భారత్​

భారత్​కు చెందిన 87 మంది సిక్కు యాత్రికులకు పాకిస్థాన్ వీసా ఇవ్వడానికి నిరాకరించడాన్ని భారత విదేశీ వ్యవహారాలశాఖ ఆక్షేపించింది. పాకిస్థాన్​లో నిర్వహిస్తోన్న ఐదో సిక్కు గురువు 'గురు అర్జున్​ దేవ్'​ వర్థంతికి హాజరవ్వాలని కోరుకుంటున్న భక్తులకు తక్షణమే వీసాలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసింది.

సిక్కుమతం ప్రకారం, గురు అర్జున్ దేవ్​ వర్థంతిని 'షాహదీ జోర్​ మేళా' లేదా 'షాహిదీ పురబ్' అంటారు.​ ఇలాంటి మతపరమైన పుణ్యక్షేత్రాల సందర్శనకు 1974 ద్వైపాక్షిక ప్రోటోకాల్​ ప్రకారం పర్యటక వీసా మంజూరు చేయాలి. భక్తుల మనోభావాలను అనుసరించి వారికి పాకిస్థాన్​ బేషరతుగా వీసా మంజూరు చేయాలని భారత్​ కోరింది.

మీరే అడ్డుకున్నారు..

తమ రైలుకు భారత్​ అనుమతి ఇవ్వకుండా అడ్డుకుందని ఆరోపించింది పాకిస్థాన్. ఫలితంగా 200 మంది సిక్కు యాత్రికులను లాహోర్​కు తీసుకువెళ్లడానికి వీలుపడడంలేదని సమాధానమిచ్చింది.

"జోర్​ మేళాకు హాజరవ్వడానికి 200 మంది భారత సిక్కులకు పాకిస్థాన్ వీసా మంజూరు చేసింది. వారు శుక్రవారం పాకిస్థాన్ రైల్లో లాహోర్​కు చేరుకోవాల్సి ఉంది. అయితే ఈ రైలును తమ భూభాగంలోకి ప్రవేశించకుండా భారత్ అడ్డుకుంది. ఫలితంగా ఈ 200 మంది యాత్రికులను లాహోర్​కు తీసుకురావడానికి వీలు పడలేదు."- అమీర్ హష్మి, ఇవాక్యూ ట్రస్ట్​ ప్రోపర్టీ బోర్డ్​ ప్రతినిధి

పాకిస్థాన్ రైలుకు అనుమతించకపోవడానికి కారణాలనూ భారత్​ వెల్లడించలేదని పాక్​ ఆరోపించింది.

ఇదీ చూడండి: తమిళనాట దాహం కేకలు- వరుణుడిపైనే ఆశలు

Last Updated : Jun 15, 2019, 7:01 AM IST

ABOUT THE AUTHOR

...view details