తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జిమెక్స్-20: అరేబియాలో భారత్- జపాన్ నౌకాదళ విన్యాసాలు - భారత్ జపాన్ వార్తలు

ఉత్తర అరేబియా సముద్ర ప్రాంతంలో భారత్, జపాన్​ నౌకాదళ విన్యాసాలు జిమెక్స్-20 ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో ఇరు దేశాలకు చెందిన కీలక యుద్ధ నౌకలు వివిధ ప్రదర్శనలు చేయనున్నాయి.

JIMEX-20
జిమెక్స్-20

By

Published : Sep 26, 2020, 11:30 AM IST

భారత్, జపాన్​ 4వ దఫా సంయుక్త నౌకాదళ విన్యాసాలు 'జిమెక్స్-20' శనివారం నుంచి ప్రారంభమయ్యాయి. భారత్ నేవీ, జపాన్​ సముద్ర స్వీయ రక్షణ దళం (జేఎంఎస్​డీఎఫ్) కలిసి ఉత్తర అరేబియా సముద్రంలో నిర్వహిస్తోన్న ఈ డ్రిల్స్ మూడు రోజుల పాటు కొనసాగనున్నాయి.

సముద్ర భద్రతా సహకారానికి సంబంధించి 2012 నుంచి జిమెక్స్ విన్యాసాలు చేస్తున్నాయి రెండు దేశాలు. 2018 అక్టోబర్​లో విశాఖపట్నంలో చివరి సారిగా భారత్​, జపాన్​ డ్రిల్స్ నిర్వహించాయి.

భారత్-జపాన్ నౌకాదళ విన్యాసాలు

ద్వైపాక్షిక ప్రయోజనాలు..

కొన్నేళ్ల నుంచి భారత్​, జపాన్ నౌకాదళాల మధ్య సహకారం పెరుగుతూ వస్తోంది. జిమెక్స్-20 లో భాగంగా అధునాతన స్థాయి కార్యకలాపాలు, విన్యాసాలు నిర్వహించనున్నారు. అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా సురక్షితమైన, స్వేచ్ఛా, సమగ్ర ప్రయోజనాలే లక్ష్యంగా కలిసి పనిచేసే దిశగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

భారత్-జపాన్ నౌకాదళ విన్యాసాలు

కరోనా నేపథ్యంలో..

సముద్ర ఆపరేషన్లలో పరస్పర సహకారం, సమాచార మార్పిడికి జిమెక్స్-20 వేదిక కానుంది. బహుళ పాక్షిక వ్యూహాలు, ఆయుధాల వినియోగం, హెలికాప్టర్ ఆపరేషన్లు జరగనున్నాయి. ఇరుదేశాలు అభివృద్ధి చేసిన ఉపరితల, జలాంతర్గాములు, వాయు నిరోధక సాంకేతికతలను ప్రదర్శించనున్నారు. కరోనా నిబంధనలను పాటిస్తూ 'నాన్ కాంటాక్ట్ సీ ఓన్లీ ఫార్మాట్​'లో విన్యాసాలను నిర్వహించటం కొసమెరుపు.

భారత్-జపాన్ నౌకాదళ విన్యాసాలు

ఇదీ చూడండి:రెండు రోజులపాటు భారత్- ఆస్ట్రేలియా నౌకాదళ విన్యాసాలు

ABOUT THE AUTHOR

...view details