భారత్-జపాన్ అనుబంధం గురువారం మరో మైలురాయిని చేరింది. ఎన్నో ఏళ్ల పాటు సాగిన సంప్రదింపుల అనంతరం రక్షణ రంగంలో కీలక ఒప్పందం కుదుర్చుకున్నాయి ఇరు దేశాలు. ఈ ఒప్పందం ద్వారా.. భారత్-జపాన్ సైన్యాలు లాజిస్టిక్స్పరంగా పరస్పర సహకారం పొందవచ్చు. ఆసియాలో చైనా ప్రాబల్యం పెరుగుతున్న తరుణంలో ఈ కీలక ఒప్పందానికి ప్రాధాన్యం ఏర్పడింది.
రక్షణశాఖ కార్యదర్శి అజయ్ కుమార్, జపాన్ రాయబారి సుజుకి సతోషి ఈ ఒప్పందంపై సంతకాలు చేసినట్టు రక్షణశాఖ వెల్లడించింది. ఈ ఒప్పందంతో ఇరు దేశాల మధ్య రక్షణ రంగంలో సహకారం మరింత బలపడుతుందని, మరమ్మతులు, ఇతర అవసరాల కోసం ఒక దేశ సైనిక శిబిరాన్ని మరో దేశం వినియోగించుకోవచ్చని పేర్కొంది.
అబేకు మోదీ ఫోన్...