తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత్​లో ప్రతి లక్ష జనాభాకు.. కరోనా కేసులెన్నో తెలుసా? - corona deaths latest news

దేశంలో ప్రతి లక్ష మందిలో 7.1 మందికి వైరస్​ సోకినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యలు సత్ఫలితాలు ఇచ్చాయని పేర్కొంది.

India is having about 7.1 COVID-19 positive cases per lakh population as compared to the total confirmed cases in the world
కరోనా: దేశంలో ప్రతి లక్షజనాభాకు 7.1 కేసులు నమోదు

By

Published : May 18, 2020, 10:22 PM IST

కరోనా వ్యాప్తి విషయంలో భారత్​ కట్టుదిట్టంగా వ్వవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. లాక్​డౌన్​ వల్ల కొవిడ్​ వ్యాప్తిని బాగా అరికట్టగలిగినట్లు పేర్కొంది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ. దేశంలో ప్రతి లక్ష మందిలో 7.1 మందికి మహమ్మారి సోకినట్లు తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఈ సంఖ్య 60కి చేరిందని స్పష్టం చేసింది. వైరస్ నియంత్రణ కోసం ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యలు సత్పలితాలిచ్చినట్లు వెల్లడించింది.

ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 40 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. భారత్​లో 96,169 మంది వైరస్​ బారిన పడ్డారు.

"దేశంలో ప్రస్తుతం 56,316 యాక్టివ్​​ కేసులున్నాయి. ఇప్పటివరకు 36,824 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో మొత్తం 2,715 మందికి వైరస్​ నయమైంది. ప్రస్తుతం రికవరీ రేటు 38.29 శాతంగా ఉంది".

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ

మే 31 వరకు లాక్​డౌన్​ పొడిగిస్తూ.. రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదివారం నూతన మార్గదర్శకాలు జారీ చేసింది కేంద్రం. రెడ్​, గ్రీన్​, ఆరెంజ్ జోన్ల నిర్ణాయాధికారం రాష్ట్రాలకే అప్పగించింది. అంతర్​ రాష్ట్ర బస్సులకు అనుమతిచ్చింది. విమానాలు, రైళ్లు, మెట్రో సేవలపై నిషేధం కొనసాగించింది.

ABOUT THE AUTHOR

...view details