తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'టీకాల పంపిణీ ఆత్మనిర్భర్​ భారత్​కు సంకేతం'

స్వల్ప వ్యవధిలోనే కరోనా టీకాను తయారు చేయడం ద్వారా ప్రపంచానికి భారత్​ తన సత్తాను చాటిందన్నారు నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్. దిల్లీ ఎయిమ్స్​లో శనివారం కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఆయన.. 'ఆత్మనిర్భర్​ భారత్​'లో భాగంగా పౌరుల సంరక్షణలోనూ దేశం స్వావలంబన సాధించిందన్నారు.

nitiayog member vk paul
నీతి ఆయోగ్​ సభ్యుడు వీకే పాల్​

By

Published : Jan 17, 2021, 5:21 AM IST

ఇతర దేశాల్లో వ్యాక్సిన్ల తయారీ ఇంకా ప్రయోగ దశలో ఉందని.. స్వల్ప వ్యవధిలోనే కరోనా టీకాను తయారు చేయడం ద్వారా భారతదేశ సత్తాను ప్రపంచం గుర్తించిందని తెలిపారు నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్. ఫలితంగా 'ఆత్మనిర్భర్​ భారత్​'లో భాగంగా దేశ ప్రజల రక్షణలో గొప్ప ముందడుగు పడిందన్నారు.

సుమారు 3 కోట్ల మంది కరోనా యోధులకు( ఫ్రంట్​లైన్​ వర్కర్లకు) టీకా పంపిణీ లక్ష్యంగా మొదటి దశ వ్యాక్సిన్​ డ్రైవ్​ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారని వీకే పాల్​ తెలిపారు. దిల్లీలోని ఎయిమ్స్​లో శనివారం ఆయన కరోనా టీకా వేయించుకున్నారు.

అపోహలొద్దు..

అతి తక్కువ సమయంలోనే కరోనా వ్యాక్సిన్లు తయారు చేసి సాంకేతికతలో ముందున్నామని నిరూపించామని.. దేశీయంగా తయారైన రెండు టీకాలు అనుమతి పొందడం గొప్ప విషయమని వీకే పాల్​ అన్నారు. టీకాలు వేయించుకునేందుకు ప్రజలు ముందుకు రావాలని కోరారు. కరోనా తీవ్రతను గుర్తించి టీకా ప్రయోజనం పొందాలని విజ్ఞప్తి చేశారు.

అనేక ప్రయోగాలు, వేల మందిపై ట్రయల్స్ జరిపిన తరువాతే ఈ టీకాల విడుదలయ్యాయి. ప్రతికూల పరిస్థితుల్లో పరిశోధనలు నిర్వహించిన శాస్త్రవేత్తలను గౌరవిద్దాం. ప్రస్తుతం మనకు రెండు గొప్ప టీకాలు అందుబాటులో ఉన్నాయి. మీకు ఏ టీకా కేటాయించినా వద్దనకుండా తీసుకోండి.

-వీకే పాల్​, నీతి ఆయోగ్​ సభ్యుడు.

ఇదీ చదవండి:భారత్​లో టీకా పంపిణీ- తొలిరోజు విజయవంతం

ABOUT THE AUTHOR

...view details