చైనా కార్యకలాపాలను ట్రాక్ చేసేందుకు హిందూ మహా సముద్ర ప్రాంతంలో నిఘా వ్యవస్థను పెంచింది భారత్. దాదాపు రెండు నెలలుగా సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో భారత్ తీసుకున్న నిర్ణయానికి ప్రాధాన్యత సంతరించుకుంది. నిఘా పెంచడం సహా బలగాల మోహరింపు కూడా చేపట్టినట్టు తెలుస్తోంది.
ఇదే క్రమంలో మిత్రపక్షాలైన అమెరికా నావికా దళం, జపాన్ స్వీయ రక్షణ దళాలతో భారత నావికా దళం కలిసి పనిచేస్తోంది.
గత శనివారం జపాన్ నావికా దళంతో హిందూ మహా సముద్ర ప్రాంతంలో విన్యాసాలు చేపట్టింది భారత నావికా దళం. ఐఎన్ఎస్ రాణా, ఐఎన్ఎస్ విక్రాంత్‌లు ఇందులో పాల్గొన్నాయి. ఈ ప్రాంతంలోనే చైనా నౌకలు తరచూ కనిపిస్తుండటం గమనార్హం.
హిందూ మహా సముద్రంలో చైనా తన ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో చైనాకు అడ్డుకట్ట వేసే విధంగా అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, ఫ్రాన్స్, భారత నావికా దళాలు తమ మధ్య ఉన్న బంధాన్ని బలపర్చుకుంటున్నాయి.
ఇదీ చూడండి:-'హిందూ మహా సముద్రంలోనూ చైనా కుట్రలు'