తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అణ్వాయుధాలు చైనా, పాక్​​ కంటే భారత్​ వద్దే తక్కువ! - SIPRI latest report on India nuclear weapons

అణ్వాయుధ సంపత్తిలో భారత్​ కంటే చైనా, పాకిస్థాన్ మెరుగైన స్థానంలో ఉన్నాయని పేర్కొంది 'ద స్టాక్​హోమ్​ ఇంటర్నేషనల్ పీస్​ రీసెర్చ్ ఇన్​స్టిట్యూట్​ (సిప్రి)'. 2019లో కొన్ని అణ్వాయుధాలను సమకూర్చుకున్నప్పటికీ భారత్​ వద్దే తక్కువున్నాయని తెలిపింది. ప్రపంచంలోని 90 శాతం కన్నా ఎక్కువ అణ్వాయుధాలు రష్యా, అమెరికా వద్దే ఉన్నాయని వెల్లడించింది సిప్రి.

India increased nuclear arsenal in 2019, but has fewer weapons than China, Pak: SIPRI report
అణ్వాయుధాలు చైనా, పాకిస్థాన్​ కంటే భారత్​ వద్దే తక్కువట

By

Published : Jun 15, 2020, 3:15 PM IST

చైనా, పాకిస్థాన్‌ వద్ద భారత్‌ కంటే ఎక్కువ అణ్వాయుధాలు ఉన్నాయని స్వీడన్‌కు చెందిన ద స్టాక్‌హోమ్‌ ఇంటర్నేషనల్‌ పీస్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌(సిప్రి) లెక్కగట్టింది.

ప్రపంచంలో ప్రస్తుతం అమెరికా, రష్యా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, చైనా, భారత్​, పాకిస్థాన్‌, ఇజ్రాయెల్‌, ఉత్తర కొరియా దేశాల వద్ద అణ్వాయుధాలున్నాయి. జనవరి 2020 నాటికి ఈ దేశాలన్నింటి వద్ద మొత్తం 13,400 అణ్వాయుధాలు ఉన్నట్లు ఈ అంతర్జాతీయ సంస్థ అంచనా వేసింది. ఇందులో చైనా వద్ద 320 న్యూక్లియర్‌ వార్‌హెడ్‌లు ఉండగా.. పాక్‌ వద్ద 160, భారత్‌ వద్ద 150 ఉన్నాయని 'ఇయర్ బుక్‌ 2020'లో పేర్కొంది సిప్రి. ప్రస్తుతం లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి భారత్‌- చైనా మధ్య వివాదం నెలకొన్న నేపథ్యంలో.. ఈ వివరాలు బయటకు రావడం ప్రాముఖ్యం సంతరించుకుంది.

స్వీడన్‌ ప్రభుత్వం 1966లో స్థాపించిన సిప్రి.. ప్రపంచ దేశాల ఆయుధ బలాబలాలు, అంతర్జాతీయ భద్రతను అంచనా వేస్తుంది. రష్యా వద్ద 6,375..., అమెరికా వద్ద 5,800 అణ్వాయుధాలు ఉన్నాయని పేర్కొంది. ప్రపంచంలోని 90 శాతం కన్నా ఎక్కువ అణ్వాయుధాలను ఈ రెండు దేశాలే కలిగి ఉన్నట్లు సిప్రి వివరించింది. అంతర్జాతీయంగా అన్ని దేశాలూ తమ అణుబలగాన్ని ఆధునీకరిస్తున్నాయని పేర్కొంది.

భారత్‌, పాక్ సహా పలుదేశాలు అణ్వాయుధ సమాచారాన్ని దాచిపెడుతున్నాయని సిప్రి ఆరోపించింది. కాగా, చైనా గతంలో కంటే ఎక్కువగా బలప్రదర్శన చేస్తోందని విశ్లేషించింది. ఈ సంస్థ కథనం ప్రకారం సైనిక వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల్లో అమెరికా, చైనా తర్వాత భారత్‌ మూడో స్థానంలో ఉంది. అయితే, 2019లో ప్రపంచ వ్యాప్తంగా అణ్వాయుధాల సంఖ్య తగ్గినట్లు ఈ సంస్థ ప్రకటించింది. గత సంవత్సరం 13,865గా ఉన్న ఈ సంఖ్య ప్రస్తుతం 13,400కి చేరినట్లు పేర్కొంది.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details