రష్యా తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ దిగుమతిపై సంప్రదింపులు జరుపుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. లోక్సభలో ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్వినీ చౌబే ఈ విషయాన్ని వెల్లడించారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 36 వ్యాక్సిన్లపై క్లినికల్ ప్రయోగాలు జరుగుతున్నాయని, అందులో భారత్కు చెందిన రెండు వ్యాక్సిన్లు ఉన్నాయని వివరించారు చౌబే. అయితే ఏవి కూడా తుది దశ ప్రయోగాలకు చేరుకోలేదని చెప్పారు.