భారత్లో ముస్లింల పట్ల భయాన్ని పెంచేలా కొన్ని ఘటనలు జరిగాయంటూ ఇస్లామిక్ సహకార సంస్థ(ఓఐసీ) చేసిన వ్యాఖ్యల్ని ఖండించారు మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ. ముస్లింలకు భారత్ స్వర్గం వంటిదని ఉద్ఘాటించారు. అలాంటి వాతావరణాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నవారు ఎప్పటికీ ముస్లింల మేలు కోరేవారు కారని విమర్శించారు.
'భారత్ ఎల్లప్పుడూ ముస్లింల సామాజిక, ఆర్థిక, మతపరమైన హక్కులకు రక్షణ కల్పిస్తుంది. మా విధులు మేం నిర్వర్తిస్తున్నాం. ప్రధాని ఎప్పుడు మాట్లాడినా.. 130 కోట్ల భారతీయుల సంక్షేమం గురించే మాట్లాడతారు.'
- ముక్తార్ అబ్బాస్నఖ్వీ, మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి