కరోనా వైరస్‌ను అరికట్టేందుకు భారత్ తీసుకుంటున్న చర్యలపై ప్రశంసలు కురిపించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ). గతంలో ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రభావం చూపిన మశూచి, పోలియో వ్యాధుల నియంత్రణలో భారత్ విజయం సాధించిందని గుర్తు చేసింది. ఈ రెండు వ్యాధుల నియంత్రణలో భారత్ ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచిందని స్పష్టం చేసింది.
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 15,000 మంది మృతికి కారణమైన ఈ వైరస్ నియంత్రణకు ఆర్థికంగా, సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందిన దేశాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరోనాను అరికట్టడంలో భారత్ విజయం సాధిస్తుందని డబ్ల్యూహెచ్ఓ వ్యాఖ్యానించడం విశేషం.
" చైనా తర్వాత ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారత్‌కు ఈ వైరస్‌ను పూర్తిగా నిర్మూలించే సత్తా ఉంది. గతంలో మశూచి, పోలియో వంటి భయంకర వ్యాధులను ఎదుర్కొని ప్రపంచ దేశాలకు మార్గదర్శకంగా నిలిచింది. వైరస్‌కు సులభమైన పరిష్కారాలు ఏమీ లేవు. గతంలో చూపిన సమర్థతను మరోసారి ప్రదర్శించి భారత్ మరోసారి ప్రపంచదేశాలకు ఆదర్శంగా నిలవాలి."