భారతదేశాన్ని ప్రతిసారీపాకిస్థాన్తోఎందుకు పోల్చుతున్నారని ప్రధాని మోదీని ప్రశ్నించారు పశ్చిమ్ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా సిలిగుడి ర్యాలీలో పాల్గొన్న ఆమె.. మోదీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు గడిచినప్పటికీ.. పౌరసత్వం నిరూపించుకోవాల్సి రావడం సిగ్గుచేటని మండిపడ్డారు.
మోదీజీ.. ప్రతిసారీ పాకిస్థాన్‌తో పోలికేంటి: మమత - Gangadhar Y
ప్రధానమంత్రిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు పశ్చిమ్ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. గొప్ప సంస్కృతి, విలువలున్న మన దేశాన్ని మోదీ ప్రతిసారీ ఎందుకు పాకిస్థాన్‌తో పోల్చి చూస్తున్నారని ధ్వజమెత్తారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తూనే ఉంటామని ఉద్ఘాటించారు.
దేశవ్యాప్త ఎన్ఆర్సీ విషయంలోనూ భాజపా నేతలు ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని ఆరోపించారు. ఓ వైపు ప్రధానమంత్రి ఎన్ఆర్సీ ఉండదని చెబుతుంటే.. మరోవైపు కేంద్ర హోంమంత్రి, ఇతర మంత్రులు ఎన్ఆర్సీ అమలు చేస్తామని ప్రకటిస్తున్నారని గుర్తు చేశారు.
" గొప్ప సంస్కృతి, విలువలున్న దేశం మనది. ప్రధాని తరచూ మనదేశాన్ని పాకిస్థాన్‌తో ఎందుకు పోల్చుతున్నారు. మీరు భారతదేశానికి ప్రధానమంత్రా లేక పాకిస్థాన్‌కు ప్రచారకర్తనా? ప్రతి విషయంలోనూ పాకిస్థాన్ ప్రస్తావనెందుకు తెస్తున్నారు?"
- మమతా బెనర్జీ, బంగాల్ ముఖ్యమంత్రి