వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వెంబడి బలగాలను వెనక్కి తీసుకోకుండా కాలయాపన చేస్తున్న చైనా అధికార విస్తరణ కాంక్షపై దెబ్బకొట్టడానికి భారత్ సమాయత్తమవుతోంది. ఆ దిశగా పక్క ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా చైనాకు కీలకమైన కన్ఫ్యూషియస్ ఇన్స్టిట్యూట్లను లక్ష్యంగా చేసుకుంటోంది. దేశంలో వాటి స్థాపనను అడ్డుకోవాలని యోచిస్తోంది.
అంతర్జాతీయ చైనీష్ భాషా మండలి ఆధ్వర్యంలో కన్ఫ్యూషియస్ ఇన్స్టిట్యూట్లు పని చేస్తాయి. విదేశాల్లో చైనీస్ భాష, సంస్కృతికి విస్తృత ప్రచారం కల్పించడం ఈ ఇన్స్టిట్యూట్ల ప్రధాన విధి. ఇందుకోసం ఆయా దేశాల్లో స్థానిక విద్యాసంస్థలతో కలిసి పని చేస్తాయి. ప్రపంచవ్యాప్తంగా 500కు పైగా కన్ఫ్యూషియస్ ఇన్స్టిట్యూట్లు ఉండగా.. అందులో 100కు పైగా ఒక్క అమెరికాలోనే ఉన్నాయి.