తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పొరుగు దేశాల్లో శ్రీలంకకే తొలి ప్రాధాన్యం: మోదీ

శ్రీలంక ప్రధాని మహీంద రాజపక్సతో భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రెండు దేశాలది వేల ఏళ్లనాటి బంధమని, తొలి ప్రాధాన్యం శ్రీలంకకేనని స్పష్టం చేశారు. కరోనా సమయంలో ఇతర దేశాల కోసం భారత్ చేసిన కృషిని రాజపక్స ప్రశంసించారు.

india srilanka bilateral summit
మోదీ రాజపక్స

By

Published : Sep 26, 2020, 2:07 PM IST

భారత్, శ్రీలంక మధ్య బంధం వేల ఏళ్ల నాటిదని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. రెండు దేశాల మధ్య సంబంధాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు. పార్లమెంటరీ ఎన్నికల్లో గెలిచిన శ్రీలంక ప్రధాని రాజపక్సకు మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

భారత్​, శ్రీలంక వర్చువల్ ద్వైపాకిక్ష సదస్సులో భాగంగా.. శ్రీలంక ప్రధాని మహీంద రాజపక్సతో సమావేశమయ్యారు మోదీ.

ఈ సందర్భంగా కరోనా సమయంలో ఇతర దేశాల కోసం భారత్ చేసిన కృషిని రాజపక్స ప్రశంసించారు. ఇటీవల శ్రీలంక సమీపంలో న్యూడైమండ్ నౌక అగ్ని ప్రమాదం సమయంలో ఇరు దేశాల సహకారం అమోఘమని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details