కరోనా మరణాలు.. ప్రపంచ సగటుతో పోల్చుకుంటే భారత్లో అత్యల్పమని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రపంచంలో ప్రతి లక్షమందిలో సగటున 6.04 మంది చొప్పున మరణాలు నమోదవుతుంటే.. భారత్లో ఒక్కరు మాత్రమే మరణిస్తున్నారని అధికారులు వెల్లడించారు. ప్రపంచంలోని అతికొద్దిదేశాల ఈ జాబితాలో భారత్ నిలిచిందని స్పష్టం చేసింది.
వైరస్ బాధితులను సకాలంలో గుర్తించడం, విస్తృతమైన కాంటాక్ట్ ట్రేసింగ్, సమర్థమైన క్లినికల్ నిర్వహణ ఫలితంగానే తక్కువ మరణాలు నమోదవుతున్నాయని అధికారులు వివరించారు.
ప్రపంచ దేశాల్లో ఇలా!
జూన్ 22న ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ప్రతి లక్షమందిలో కరోనా మరణాలు బ్రిటన్లో 63.13, స్పెయిన్లో 60.60, ఇటలీలో 57.19, అమెరికాలో 36.30, జర్మనీ 27.32, బ్రెజిల్లో 23.68, రష్యాలో 5.62గా ఉన్నాయి.
రికవరీ శాతం పెరుగుతోంది!