భారత్‌లో మే ప్రారంభం నాటికి 64 లక్షల మంది కరోనా బారినపడ్డారని భారత అత్యున్నత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) అంచనా వేసింది. జాతీయ స్థాయిలో వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన 28 వేల మంది రక్తనమూనాలను పరీక్షించి ఈ విషయాన్ని వెల్లడించింది.
కరోనా వ్యాప్తి మొదలైన తర్వాత తొలిసారి నిర్వహించిన సెరోసర్వే ఫలితాలను ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్‌లో ప్రచురించింది. దీని ప్రకారం దేశంలో 64,68,388 మంది (0.73 శాతం) వయోజనులు కరోనాకు గురైనట్లు వెల్లడైంది. ఈ సర్వేను మే 11 నుంచి జూన్ 4 మధ్యలో నిర్వహించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది.