కరోనా కట్టడి కోసం పొరుగుదేశాలకు భారత్ ఆపన్నహస్తం అందిస్తోంది. విదేశాలకు టీకా డోసులను ఉచితంగా పంపిస్తోంది. తాజాగా ద్వీపదేశం శ్రీలంకకు 5 లక్షలు, బహ్రెయిన్‌కు లక్ష డోసులను బహుమతి రూపంలో సరఫరా చేసింది. వీటితో కలిపి జనవరి 20 నుంచి ఇప్పటివరకు విదేశాలకు పంపిన డోసుల సంఖ్య 55 లక్షలకు చేరిందని విదేశాంగ శాఖ తెలిపింది.
'విదేశాలకు ఉచితంగా 55 లక్షల డోసులు' - India coronavirus vaccines to foreign
కరోనాపై పోరులో భాగంగా ఇప్పటి వరకు విదేశాలకు 55 లక్షల టీకా డోసులను భారత్ ఉచితంగా అందించినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. గురువారం శ్రీలంక, బహ్రెయిన్ దేశాలకు టీకాలను పంపింది.
విదేశాలకు 55 లక్షల భారత్ ఉచిత టీకాలు
వివిధ దేశాలకు అందించిన డోసుల వివరాలు
దేశం | టీకా డోసులు(లక్షల్లో) |
బంగ్లాదేశ్ | 20 |
మయన్మార్ | 15 |
నేపాల్ | 10 |
శ్రీలంక | 5 |
భూటాన్ | 1.5 |
మారిషస్ | 1 |
మాల్దీవులు | 1 |
బహ్రెయిన్ | 1 |
సీషెల్స్ | 0.50(యాభై వేలు) |