తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఉగ్రవాదంపై భారత్​-జర్మనీ ఉమ్మడి పోరు ఉద్ధృతం' - indogerman bilateral meet

ఉగ్రవాదం నిర్మూలన కోసం భారత్​, జర్మనీ మధ్య ద్వైపాక్షిక సహకారం, సంబంధాలు మరింత బలోపేతం చేసేందుకు తీర్మానించినట్లు ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. దిల్లీలోని హైదరాబాద్​ హౌస్​లో జరిగిన అంతర్​ ప్రభుత్వ సంప్రదింపుల్లో భారత్​, జర్మనీ మధ్య 11 ఒప్పందాలు కుదిరాయి.

PM-LD MERKEL

By

Published : Nov 1, 2019, 3:09 PM IST

Updated : Nov 1, 2019, 4:28 PM IST

'ఉగ్రవాదంపై భారత్​-జర్మనీ ఉమ్మడి పోరు ఉద్ధృతం'

కీలక అంశాల్లో పరస్పర సహకారం పెంపొందించుకోవాలని భారత్​, జర్మనీ నిర్ణయించినట్లు ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. దిల్లీలోని హైదరాబాద్ హౌస్​లో 5వ అంతర్ ప్రభుత్వ సంప్రదింపుల్లో భాగంగా జర్మనీ ఛాన్సలర్​ ఏంజెలా మెర్కెల్​తో సమావేశమయ్యారు మోదీ.

ఇద్దరు దేశాధినేతల సమక్షంలో జరిగిన చర్చల తర్వాత మోదీ, మెర్కెల్​ సంయుక్త మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ భేటీలో 5 తీర్మానాలు, 11 ఒప్పందాలు కుదిరినట్లు మోదీ తెలిపారు.

"2022 నాటికి సరికొత్త భారత్​ను నిర్మిస్తామని హామీ ఇస్తున్నాం. సాంకేతికత, ఆర్థిక రంగాల్లో ముందున్న జర్మనీ లాంటి దేశాల సహకారంతోనే ఇది సాధించగలం. ఉగ్రవాదం, వేర్పాటువాదాన్ని నిర్మూలించేందుకు రెండు దేశాల మధ్య సంబంధాల బలోపేతం చేయాలని తీర్మానించాం. ఈ-మొబిలిటీ, ఆకర్షణీయ నగరాలు, నదుల ప్రక్షాళన, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాల్లో సహకరించుకోవాలని నిర్ణయించాం."

-నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

ఒప్పందాలపై మెర్కెల్ హర్షం

ఒప్పందాలను పరిశీలిస్తే అత్యాధునిక సాంకేతిక రంగంలో రెండు దేశాలు కలిసి సాగుతున్న తీరు అర్థమవుతుందని మెర్కెల్​ అభిప్రాయపడ్డారు. 5జీ, కృత్రిమ మేధ వంటి రంగాల్లో సహకారానికి ఉన్న అవరోధాలను అధిగమించాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు. భారత్​తో భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో భాగం కావటానికి సిద్ధమన్నారు మెర్కెల్.

ఇదీ చూడండి: రాజ్​ఘాట్​లో మహాత్ముడికి మెర్కెల్​ నివాళి

Last Updated : Nov 1, 2019, 4:28 PM IST

ABOUT THE AUTHOR

...view details