భారత మానవ సహిత అంతరిక్ష ప్రయోగం గగన్‌యాన్‌లో పాల్గొనే వ్యోమగాములకు అవసరమైన పరికరాలను సమకూర్చేందుకు భారత్, ఫ్రాన్స్ అంతరిక్ష సంస్థలు చర్చలు సాగిస్తున్నాయి. వచ్చే ఏడాది మిషన్ అల్ఫాలో పాల్గొనే.. ఫ్రెంచ్ వ్యోమగామి థామస్ పెస్‌క్వెట్ వాడే పరికరాలనే గగన్‌యాన్ వ్యోమగాములు వినియోగించనున్నారని అధికారులు తెలిపారు. ఇప్పటికే మిషన్ అల్ఫా పరికరాలకు సంబంధించిన పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. ఈ మేరకు చర్చలు తుదిదశకు చేరుకున్నాయని.. త్వరలో అధికారిక ప్రకటన రానుందని పేర్కొన్నారు.
గగన్‌యాన్ కోసం భారత్‌కు ఫ్రాన్స్ సహకారం - గగన్‌యాన్ ప్రాజెక్టు విలువ
ప్రతిష్ఠాత్మక మానవసహిత అంతరిక్ష ప్రయోగం గగన్‌యాన్ కోసం ఫ్రాన్స్‌తో కీలక చర్చలు జరుపుతోంది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో. 2022 నాటికి ముగ్గురు భారత వ్యోమగాములను, అంతరిక్షంలోకి పంపే రూ.10 వేల కోట్ల విలువైన ప్రాజెక్టు కోసం ఇరు దేశాలు కలిసి పనిచేస్తున్నాయి.
మిషన్ గగన్‌యాన్ కోసం కలిసిపని చేయనున్న భారత్ ఫ్రాన్స్
అంతరిక్ష రంగంలో భారత్-ఫ్రాన్స్ బలమైన సహకారం అందించుకుంటున్నాయి. 2022 నాటికి ముగ్గురు భారత వ్యోమగాములను, అంతరిక్షంలోకి పంపే రూ.10 వేల కోట్ల విలువైన గగన్‌యాన్ కోసం ఇరు దేశాలు కలిసి పనిచేస్తున్నాయి.
ఇదీ చూడండి:చైనాను కలవరపెట్టిన భారత సీక్రెట్ ఆపరేషన్