తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గగన్​యాన్ వ్యోమగాములకు ఫ్రాన్స్ పరికరాలు - గగన్​యాన్ పరికరాలు

గగన్​యాన్ వ్యోమగాములకు కావాల్సిన పరికరాలు సమకూర్చే అంశంపై భారత్- ఫ్రాన్స్ మధ్య జరుగుతున్న అత్యున్నత స్థాయి చర్చలు తుది దశకు చేరుకున్నాయి. ఐరోపా అంతరిక్ష సంస్థ ప్రయోగించనున్న మిషన్ ఆల్ఫా తరహాలోనే ఈ పరికరాలు ఉండనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై ప్రకటన వెలువడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

India, France in discussion for Mission Alpha-like equipment for Gaganyaan astronauts
గగన్​యాన్ వ్యోమగాములకు ఫ్రాన్స్ పరికరాలు

By

Published : Aug 30, 2020, 6:16 PM IST

గగన్​యాన్ ప్రయోగంలో పాల్గొనే వ్యోమగాములకు కావాల్సిన అత్యవసర పరికరాలు సమకూర్చే విషయంపై భారత్-ఫ్రాన్స్ అంతరిక్ష సంస్థల​ మధ్య అత్యున్నత చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని ఫ్రాన్స్ జాతీయ అంతరిక్ష అధ్యయన కేంద్ర(ఎన్​సీఎస్​ఎస్​) అధికారులు తెలిపారు. మిషన్ ఆల్ఫాలో వ్యోమగామి థామస్ పెస్క్వెట్ ఉపయోగించే తరహా పరికరాలనే భారత్​కు అందించనున్నట్లు తెలుస్తోంది.

మిషన్ ఆల్ఫా కోసం పరికరాల తయారీ ప్రారంభమైందని.. ఫ్రాన్స్ అంతరిక్ష సంస్థ సీనియర్ అధికారులు వెల్లడించారు. ఐరోపా అంతరిక్ష సంస్థ తరపున ఫ్రాన్స్​కు చెందిన పెస్క్వెట్ ఈ యాత్రలో భాగం కానున్నారు.

మరోవైపు కరోనా తగ్గుముఖం పట్టి.. పరిస్థితులు మెరుగుపడిన తర్వాత భారత స్పేస్ సర్జన్లు శిక్షణ కోసం ఫ్రాన్స్​కు వెళ్లనున్నట్లు ఇస్రో అధికారులు వెల్లడించారు.

బలమైన బంధం

భారత్, ఫ్రాన్స్ మధ్య అంతరిక్ష రంగంలో లోతైన సంబంధాలు ఉన్నాయి. గగన్​యాన్ కోసం ఇరుదేశాలు సహకరించుకుంటున్నాయి. ఇందుకోసం భారత్​లోని వైద్యులు, ఇంజినీర్లకు సీఎన్​ఈఎస్ అధికారులు గతేడాది శిక్షణ ఇచ్చారు. అంతరిక్ష వైద్యానికి సంబంధించి ఫ్రాన్స్​లో ప్రత్యేక సంస్థ కూడా ఉంది.

ప్రస్తుతం గగన్​యాన్ ప్రయోగం కోసం ఎంపిక చేసిన నలుగురు భారత వాయుసేన పైలట్లు రష్యాలో శిక్షణ పొందుతున్నారు. 2022 నాటికి అంతరిక్షంలోకి మానవులను పంపేందుకు ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.

ABOUT THE AUTHOR

...view details