తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రజాస్వామ్య సూచీలో మరింత దిగువకు భారత్​ - మరింత దిగువకు భారత్​

ప్రపంచ ప్రజాస్వామ్య సూచీ ర్యాంకింగ్స్​లో భారత్​ 10 స్థానాలు కోల్పోయింది. 6.90 స్కోరుతో 51వ స్థానంలో నిలిచింది. పౌర స్వేచ్ఛకు విఘాతం కలగడమే ఇందుకు కారణమని ది ఎకనామిస్ట్​ ఇంటెలిజెన్స్​ యూనిట్​ పేర్కొంది.

india-falls-to-51st-position-in-eius-democracy-index
ప్రజాస్వామ్య సూచీలో మరింత దిగువకు భారత్​

By

Published : Jan 22, 2020, 11:22 PM IST

Updated : Feb 18, 2020, 1:41 AM IST

2019 ప్రపంచ ప్రజాస్వామ్య సూచీ ర్యాంకింగ్స్​లో భారత్​ 51వ స్థానంలో నిలిచింది. 2018తో పోల్చితే 10 స్థానాలు దిగువకు పడిపోయింది భారత్​. పౌర స్వేచ్ఛకు విఘాతం కలగడమే ఇందుకు ప్రధాన కారణమని ది ఎకనామిస్ట్​ ఇంటెలిజెన్స్​ యూనిట్​ పేర్కొంది. 2018లో 7.23గా ఉన్న భారత్​ స్కోరు.. 2019లో 6.90కు చేరింది.

ప్రపంచవ్యాప్తంగా 165 స్వతంత్ర రాష్ట్రాలు, రెండు టెరిటరీల్లో ప్రస్తుత ప్రజాస్వామ్య పరిస్థితుల ఆధారంగా ఈ ర్యాంకులను ప్రకటించారు. ఎన్నికల ప్రక్రియ, బహుత్వవాదం, ప్రభుత్వ పనితీరు, రాజకీయ సంస్కృతి, పౌర స్వేచ్ఛ వంటి అంశాలను పరిగణినలోకి తీసుకున్నారు.

ఫ్లాడ్​ డెమొక్రసీ...

ప్రజాస్వామ్యం పరిపూర్ణంగా ఉన్న దేశాలకు స్కోరు 8గా ఇస్తారు. ప్రజాస్వామ్యంలో లోపం(ఫ్లాడ్​ డెమొక్రసీ)కు 6-8 మధ్యలో స్కోరు ఇస్తారు. ఒక్కోసారి 8 కూడా ఇచ్చే అవకాశముంది. హైబ్రీడ్​ రెజీమ్​(పాలన)కు 4-6 స్కోరు ఇస్తారు. అథారిటేరియన్​ రెజీమ్​కు 4కు కన్నా తక్కువ స్కోరు ఇస్తారు. ప్రస్తుతం భారత్​ ఫ్లాడ్​ డెమొక్రసీలో ఉంది.

చైనా(153 ర్యాంకు- స్కోర్​ 2.26), పాకిస్థాన్​(108 ర్యాంకు- స్కోర్​ 4.25), శ్రీలంక(69 ర్యాంకు, 6.27), బంగ్లాదేశ్​ (80 ర్యాంకు- 5.88 స్కోరు)గా ఉన్నాయి. నార్వే, ఐస్​లాండ్​, స్వీడన్​కు తొలి మూడు స్థానాలు దక్కాయి. అట్టడుగున స్థానం(167)లో ఉత్తర కొరియా నిలిచింది.

కాంగ్రెస్​ ఫైర్​...

ప్రజాస్వామ్య సూచీలో భారత్​ 10 స్థానాలు కోల్పోవడంపై కాంగ్రెస్​ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందుకు కారణం భాజపా పాలనేనని ఆరోపించింది. ప్రజాస్వామ్య విలువలను కాషాయ పార్టీ నాశనం చేయడంలో విజయం సాధించిందని ట్వీట్​ చేసింది.

కాంగ్రెస్​ ట్వీట్​
Last Updated : Feb 18, 2020, 1:41 AM IST

ABOUT THE AUTHOR

...view details