ప్రస్తుతం భారత్ ఆర్థిక మందగమనం, సామాజిక అసమానత, కొవిడ్-19 (కరోనా) వైరస్ అనే మూడు ఇబ్బందులను ఎదుర్కొంటోందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు. శుక్రవారం ప్రముఖ ఆంగ్ల పత్రికకు రాసిన కథనంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
దేశంలో జరుగుతున్న పరిణామాలపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. దేశంలో నెలకొన్న ప్రస్తుత సమస్యలు ఆర్థిక, ప్రజాస్వామ్య పరంగా అంతర్జాతీయంగా భారత్‌కు ఉన్న గుర్తింపును తగ్గిస్తాయని తెలిపారు. రాజకీయ వర్గాలతో సహా సమాజంలోని కొంతమంది మతపరమైన ఉద్రిక్తతలకు కారణమయ్యారని దిల్లీ అల్లర్లను ఉద్దేశించి అన్నారు.
ప్రజలకు రక్షణ కల్పించి న్యాయం జరిగేట్టు చూడటంలో శాంతిభద్రతలను కాపాడవలసిన సంస్థలు విఫలమయ్యాయని ఆరోపించారు. ఈ విషయంలో మీడియా కూడా వైఫల్యం చెందిందని అన్నారు. దేశ సమగ్రతను దెబ్బతీసే విధంగా ఉద్రిక్తతలు దేశవ్యాప్తంగా చోటుచేసుకొంటున్నాయని, ఈ పరిస్థితులకు కారణమైన వారే వాటిని ఆపగలరని ఆయన అభిప్రాయపడ్డారు.
ఆర్థికం దిగజారింది...
ఉదార ప్రజాస్వామ్య పద్ధతుల వల్ల కేవలం కొద్ది సంవత్సరాల వ్యవధిలో భారత్ అంతర్జాతీయ ఆర్థికాభివృద్ధి నమూనా స్థాయి నుంచి దిగజారిపోయిందని తెలిపారు. ఆర్థికాభివృద్ధికి పునాదిలాంటి సామాజిక సామరస్యం ప్రమాదంలో ఉన్నప్పుడు పన్ను రేట్ల తగ్గింపు, కార్పొరేట్ రాయితీలు, విదేశీ పెట్టుబడులు వంటివి ఎటువంటి సహాయం చేయలేవని అన్నారు.
కరోనాను అడ్డుకోవాలి...