భారత్-రష్యా మధ్య మైత్రి మరింత బలోపేతం అవుతుందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. తూర్పు ప్రాంతాల అభివృద్ధి కోసం రష్యాకు ఒక బిలియన్ అమెరికన్ డాలర్లను అప్పుగా ఇస్తున్నట్లు వ్లాదివోస్తోక్లో తూర్పు ఆర్థిక వేదిక సదస్సులో ప్రకటించారు. భారత్, రష్యాల మధ్య స్నేహం కేవలం ప్రభుత్వాలకే పరిమితం కాలేదని..., ఇరు దేశాల ప్రజలు, వాణిజ్య సంబంధాలతో ముడిపడి ఉందని తెలిపారు మోదీ. 'యాక్ట్ ఈస్ట్' పాలసీ కింద తూర్పు ఆసియా అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామన్నారు .
తూర్పు ఆర్థిక వేదిక కార్యకలాపాల్లో భారత్ కీలక భాగస్వామిగా ఉందన్నారు ప్రధాని. రష్యా చమురు, గ్యాస్ పరిశ్రమల్లో భారతీయ సంస్థలు ఏడు బిలియన్ అమెరికన్ డాలర్ల మేర పెట్టబడులు పెట్టినట్లు వివరించారు.