తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనాతో యుద్ధంలో చైనాకు అండగా భారత్​

మహమ్మారి కరోనాతో పోరాడుతున్న చైనాకు మద్దతుగా భారత్​ ఉంటుందని విదేశాంగమంత్రి జయశంకర్​ తెలిపారు. భారతీయ విద్యార్థులను స్వదేశానికి తరలించేందుకు సహకరించిన చైనా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు జయశంకర్​.

India extends support to China in fight against coronavirus
కరోనాతో యుద్ధంలో చైనాకు అండగా భారత్​

By

Published : Feb 1, 2020, 11:36 PM IST

Updated : Feb 28, 2020, 8:28 PM IST

అతిభయంకరమైన కరోనా రోజురోజుకూ విజృంభిస్తోంది. వైరస్ ధాటికి​ ఇప్పటికే చైనాలో 259 మంది ప్రాణాలు కోల్పోయారు. 12 వేల మందికిపైగా ఈ వైరస్​ సోకినట్టు ప్రాథమిక అంచనాలు తెలుపుతున్నాయి.

ఈ నేపథ్యంలో చైనా విదేశాంగమంత్రి వాంగ్​ యీతో చరవాణిలో సంభాషించారు జయశంకర్​. మహమ్మారితో పోరాడుతున్న చైనా ప్రభుత్వానికి, ప్రజలకు అండగా ఉంటామని భారత విదేశాంగ మంత్రి​ స్పష్టం చేశారు. ఈ గడ్డు కాలాన్ని ఎదుర్కొనే శక్తి సామర్థ్యం డ్రాగన్​ దేశానికి ఉందని అభిప్రాయపడిన ఆయన​... త్వరలోనే వైరస్​ నుంచి బయటపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

వుహాన్​ నుంచి 324 మంది భారతీయ విద్యార్థులు స్వదేశానికి తిరిగి వచ్చిన నేపథ్యంలో.. ఇందుకు సహకరించిన చైనా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు జయశంకర్​.భారత్​ సహకారానికి ధన్యవాదాలు తెలిపారు వాంగ్​ యీ. వైరస్​ను ఎదుర్కోవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు చైనా మంత్రి.

ఇదీ చదవండి:ప్రమాదంలో ఒకే కుటుంబంలోని ఆరుగురు మృతి

Last Updated : Feb 28, 2020, 8:28 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details