తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కర్తార్​పుర్​ కోసం పాక్​తో భారత్​ ఒప్పందం! - భారత్ పాక్ సంబంధాలు

కర్తార్​పుర్​ నడవా సేవలకు సంబంధించి అక్టోబర్ 23న పాకిస్థాన్​తో ఒప్పందం కుదుర్చుకునేందుకు సిద్ధమని భారత్​ తెలిపింది. భక్తుల నుంచి రూ.1400 వసూలు చేయాలనే పాక్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసింది.

KARTARPUR

By

Published : Oct 22, 2019, 6:58 AM IST

కర్తార్​పుర్​ కోసం పాక్​తో భారత్​ ఒప్పందం

నవంబరులో ప్రారంభం కానున్న కర్తార్​పుర్ నడవాకు సంబంధించి పాకిస్థాన్​తో​ ఈ నెల 23న ఒప్పందం కుదుర్చుకుంటామని భారత విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. సేవా రుసుము కింద.. గరుద్వారాను సందర్శించే భక్తుల నుంచి 20 డాలర్లు వసూలు చేయాలన్న పాక్​ ఆలోచనపై అసంతృప్తి వ్యక్తం చేసింది. నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని పాకిస్థాన్​కు సూచించింది భారత్​.

కర్తార్‌పుర్ సందర్శనకు వీసా అవసరం లేకుండా చూడడం సహా నవంబర్ 12న జరిగే గురునానక్ దేవ్ 550వ జయంతిలోగా నడవా ప్రారంభాన్ని దృష్టిలో ఉంచుకుని పాక్‌తో ఒప్పందం కుదుర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది.

ఏటా 258 కోట్లు..

దర్బార్​ సాహిబ్​ను దర్శించుకునేవారిపై 20 డాలర్ల రుసుము విధించటం ద్వారా ఏటా రూ. 258 కోట్లు అర్జించాలని పాక్ భావిస్తోంది. ఈ విలువ పాక్​ కరెన్సీలో రూ. 571 కోట్లు. ఈ ఛార్జీల ద్వారా విదేశీ మారక ద్రవ్యాన్ని సమకూర్చుకోవాలని నిర్ణయించుకుంది పొరుగుదేశం.

రోజుకు 5 వేల మంది గురుద్వారాను సందర్శించేందుకు అనుమతించనుంది పాక్. ఒక్కొక్కరి నుంచి 20 డాలర్లు(రూ.1,400)చొప్పున రోజులో లక్ష డాలర్లు ఆదాయం పొందుతుంది.

ఇదీ చూడండి: హరియాణా​: రాజకీయ కురుక్షేత్రాన ప్రశాంతంగా పోలింగ్​

ABOUT THE AUTHOR

...view details