తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిల్లీలో లక్ష మార్క్​ దాటిన కరోనా కేసులు - corona toll

దేశంలోని వివిధ రాష్ట్రాలపై కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. దిల్లీలో కరోనా కేసుల సంఖ్య లక్ష మార్కును దాటింది. మహారాష్ట్రలో ఇవాళ మరో 5వేలకుపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. తమిళనాడులో మొత్తం కేసుల సంఖ్య 1.15 లక్షలకు చేరువైంది. కేరళలో వైరస్​ మళ్లీ విజృంభిస్తోంది.

INDIA DAILY UPDATES
దిల్లీలో లక్ష మార్క్​ దాటిన కరోనా కేసులు

By

Published : Jul 6, 2020, 7:50 PM IST

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. రోజు రోజుకు పాజిటివ్​ కేసుల నమోదులో గణనీయమైన పెరుగుదల కనిపిస్తోంది. దేశ రాజధాని దిల్లీలో కేసుల సంఖ్య లక్ష దాటింది. సోమవారం 1379 కొత్త కేసులు నిర్ధరణ అయిన నేపథ్యంలో మొత్తం కేసులు 1,00,823కు చేరాయి. 72,088 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు. 25,620 యాక్టివ్​ కేసులు ఉన్నాయి. మరో 48 మంది మృతి చెందగా మొత్తం మరణాలు 3,115కు చేరాయి.

మహారాష్ట్రలో..

మహారాష్ట్రలో 5,368 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 204 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్యం 2,11,987, మరణాలు 9,026కు చేరాయి. 87,681 యాక్టివ్​ కేసులు ఉన్నాయి. రికవరీ రేటు 54.37 శాతంగా ఉంది.

తమిళనాడులో..

తమిళనాడులో 3,827 కొత్త కేసులు రాగా మరో 61 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 1,14,978కు చేరింది. 46,833 యాక్టివ్​ కేసులు ఉన్నాయి. 1,571 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఎంపీలో..

మధ్యప్రదేశ్​లో 354 కొత్త కేసులు బయటపడ్డాయి. 9 మంది మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 15,284, మరణాలు 617కు చేరాయి.

కేరళలో..

కేరళలో కరోనా మళ్లీ పంజా విసురుతోంది. కొత్తగా 193 పాజిటివ్​ కేసులు నిర్ధరణ అయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 5,522కు చేరగా.. 2,252 మంది చికిత్స పొందుతున్నారు.

రాష్ట్రం కొత్త కేసులు మొత్తం కేసులు మొత్తం మరణాలు
దిల్లీ 1379 1,00,823 3,115
మహారాష్ట్ర 5,368 2,11,987 9,026
తమిళనాడు 3,827 1,14,978 1,571
ఉత్తర్​ప్రదేశ్​ 929 28,636 785
గుజరాత్​ 735 36,858 1962
ఎంపీ 354 15,284 617
కేరళ 193 5,522 25
ఒడిశా 456 9,526 38
చండీగఢ్​ 21 487 6
అరుణాచల్​ప్రదేశ్ 10 269 1
నాగాలాండ్ 35 625 0
పుదుచ్చెరి 65 1,000 12

ABOUT THE AUTHOR

...view details