భారత్‌లో కరోనా రక్కసి కోరలు చాస్తోంది. ఆందోళనకర స్థాయిలో రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తమిళనాట తాజాగా 5,980 మందికి వైరస్ సోకింది. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 3,43,945కు చేరింది. మరో 120 మరణాలతో... మృతుల సంఖ్య 5,886కు పెరిగింది. అయితే.. ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో 2,83,937 మందికి వైరస్ నయమవ్వగా.. 54,122 మంది వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉగ్రరూపం..
యూపీలో కొత్తగా 4,186 కరోనా కేసులు బయటపడ్డాయి. మరో 69 మంది వైరస్ కారణంగా మృతిచెందారు. మొత్తం మరణాల సంఖ్య 2,515కు చేరింది. ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో 1,04,808 మందికి వైరస్ నయమైంది.
ఒడిశాలో..
ఒడిశాలో తాజాగా 2,224 మందికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 62,294కు ఎగబాకింది. మరో 10 మంది వైరస్‌కు బలవ్వగా.. మరణాల సంఖ్య 353కు చేరింది. ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు 42,277 మంది వైరస్‌ను జయించి డిశ్చార్జ్ అయ్యారు. 19,611 మంది చికిత్స పొందుతున్నారని ఆరోగ్య శాఖ తెలిపింది.