భారత్లో కొవిడ్-19 మహమ్మారి మరింత విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 170 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 6,387 మంది వైరస్ బారినపడ్డారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కొత్త కేసులతో కలిపి దేశవ్యాప్తంగా కొవిడ్-19 బాధితుల సంఖ్య లక్షా 50వేలు దాటింది.
దేశంలో లక్షా 50వేలు దాటిన కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 6,387పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 170 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,51,767కి చేరింది.
దేశంలో లక్షా 50వేలు దాటిన కరోనా కేసులు
దేశంలో కరోనా తీవ్రంగా ఉన్న మహారాష్ట్రలో ఇప్పటివరకు 1792 మంది మరణించారు. అక్కడ బాధితుల సంఖ్య 54,758కి చేరింది. గుజరాత్లో 915, మధ్యప్రదేశ్లో 305 మంది కొవిడ్-19 ధాటికి ప్రాణాలు కోల్పోయారు.