తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కశ్మీర్'​పై మలేసియా, టర్కీకి భారత్​ గట్టి జవాబు - విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్​ కుమార్

కశ్మీర్​ అంశంపై మలేసియా, టర్కీ ప్రభుత్వాలు చేసిన ప్రకటనలను భారత్​ తప్పుబట్టింది. కశ్మీర్​ భారత అంతర్గతమని ఉద్ఘాటించారు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్​ కుమార్​. మలేసియా ప్రధాని.. ఐరాసలో కశ్మీర్​ అంశాన్ని ప్రస్తావించడం, భారత్​ను నిందించడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

'మలేసియా, టర్కీ ప్రకటనలు పూర్తి అసత్యాలు'

By

Published : Oct 4, 2019, 6:57 PM IST

Updated : Oct 4, 2019, 8:56 PM IST

'కశ్మీర్'​పై మలేసియా, టర్కీకి భారత్​ గట్టి జవాబు

జమ్ముకశ్మీర్​కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే అధికరణ 370 రద్దును విమర్శించిన టర్కీ, మలేసియా ప్రభుత్వాల్ని తప్పుబట్టింది కేంద్రం. కశ్మీర్​ భారత అంతర్గత అంశమని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్​ కుమార్ మరోసారి స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో పరిస్థితుల్ని అర్థం చేసుకొని మాట్లాడాలని టర్కీకి హితవు పలికారు.

మలేసియా ప్రధాని వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగించాయన్న రవీశ్​... దీనిపై చింతిస్తున్నట్లు తెలిపారు. మలేసియా ప్రధాని మహథిర్​ మహ్మద్​.. ఇటీవల కశ్మీర్​ అంశాన్ని ఐరాసలో లేవనెత్తారు. జమ్ముకశ్మీర్​ను భారత్ ఆక్రమించుకుందని ఆరోపించిన మహ్మద్​.. పాక్​తో చర్చించి సమస్య పరిష్కరించుకోవాలని అన్నారు.

''మలేసియా, టర్కీ చేసిన ప్రకటనలు ఆందోళనకరంగా ఉన్నాయి. టర్కీ భారత్​కు మిత్ర దేశం. ఆగస్టు 6 నుంచి టర్కీ ప్రభుత్వం.. భారత్​కు పూర్తిగా అంతర్గత విషయంలో చేస్తున్న వరుస ప్రకటనల పట్ల తీవ్రంగా చింతిస్తున్నాం. ఈ ప్రకటనలు పూర్తిగా అసత్యమైనవి, ఏకపక్షం. భవిష్యత్తులో ఇలాంటి ప్రకటనలు చేసే ముందు పూర్తి వాస్తవ పరిస్థితుల్ని తెలుసుకొని మాట్లాడేలా మేం వారితో చర్చిస్తాం. మలేసియాతోనూ మంచి సంబంధాలున్నాయి. ఇటీవల ఇంకా బలపడ్డాయి. ఇలాంటి సందర్భంలో మలేసియా ప్రధాని చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యపరిచాయి. ఈ అసత్య ప్రకటనల పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాం.''

- రవీశ్​ కుమార్​, విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి

Last Updated : Oct 4, 2019, 8:56 PM IST

ABOUT THE AUTHOR

...view details