తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మహారాష్ట్రలో కొత్తగా 12,614 కరోనా కేసులు - delhi corona cases

దేశంలో కరోనా కేసులు నానాటికీ పెరిగిపోతున్నాయి. మహారాష్ట్రలో కొత్తగా 12,614, తమిళనాడులో 5,860, బిహార్​లో 3,536, కేరళలో 1608 మందికి కరోనా సోకింది.

india covid tracer
తమిళనాట మరో 5,860 మందికి కరోనా

By

Published : Aug 15, 2020, 7:17 PM IST

Updated : Aug 15, 2020, 11:23 PM IST

దేశంలో కరోనా ఉగ్రరూపం దాల్చుతూనే ఉంది. అత్యధిక కేసులు గల రాష్ట్రాల్లో మహారాష్ట్ర ముందు ఉండగా.. తర్వాతి స్థానాల్లో తమిళనాడు, కర్ణాటక, దిల్లీ, గుజరాత్​, ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రాలు ఉన్నాయి.

మహారాష్ట్రలో..

మహారాష్ట్రలో కరోనా వ్యాప్తికి అడ్టుకట్ట పడటం లేదు. ఇవాళ రికార్డు స్థాయిలో కొత్తగా 12,614 మందికి వైరస్​ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. 322 మంది మరణించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 5,84,754కు చేరాయి. ఫలితంగా 19,749 మంది ప్రాణాలు కోల్పోయారు.

కర్ణాటకలో....

కర్ణాటకలో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. రోజూ రికార్డు స్థాయిలో కేసులు వెలుగు చూస్తున్నాయి. తాజాగా 8,818 మందికి పాజిటివ్​గా నిర్ధరణ అయింది. మరో 117 మంది మృతి చెందారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,19,926 మంది వైరస్​ బారిన పడ్డారు. వీరిలో 1,34,811 మంది డిశ్చార్జ్​ కాగా, 81,276 మంది చికిత్స పొందుతున్నారు.

తమిళనాడులో..

తమిళనాడులో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తోంది. కొత్తగా 5,860 కేసులు నమోదవ్వగా... 127 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసులు 3,32,105, మరణాలు 5,641కు చేరాయి. 54,213 మంది చికిత్స పొందుతున్నారు. 2,72,251 మంది ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్నారు.

బిహార్​లో..

బిహార్​లో తాజాగా మరో 3,536 కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర యంత్రాంగం ప్రకటించింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 36,237కు చేరింది.

దిల్లీలో...

దేశ రాజధాని దిల్లీలో మళ్లీ రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. ఇవాళ కొత్తగా 1,276 మందికి వైరస్​ నిర్ధరణ అయింది. మరో 1,143 మంది డిశ్చార్జ్​ అవ్వగా, 10 మంది మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 1,51,928కు చేరింది. ఇందులో 1,36,251 మంది వైరస్​ నుంచి కోలుకోగా.. ఇంకా 11,489 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు హస్తినలో 4188 మంది ప్రాణాలు కోల్పోయారు.

కేరళలో...

కేరళలో వైరస్​ మళ్లీ విజృంభిస్తోంది. ఇవాళ కొత్తగా 1608 మందికి వైరస్​ నిర్ధరణ అయినట్లు ఆ రాష్ట్ర యంత్రాంగం ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా 27,779 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 14,891 మంది చికిత్స పొందుతున్నారు

  • హిమాచల్​ ప్రదేశ్​​లో తాజాగా నమోదైన కేసులతో కలిపి 3,907 మంది బాధితులు ఉన్నట్లు గుర్తించారు. మొత్తం 17 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రవ్యాప్తంగా 1,274 మంది చికిత్స పొందుతుండగా, 2,580 మంది రికవరీ అయ్యారు.
  • జమ్ముకశ్మీర్​లో కొత్తగా 532 మందికి వైరస్​ సోకింది. ఇవాళ మరో 734 మంది కోలుకోగా, ఏడుగురు మృతి చెందారు. ఇప్పటి వరకు మొత్తం 28,021 మంది బాధితులు ఉన్నట్లు గుర్తించారు.
Last Updated : Aug 15, 2020, 11:23 PM IST

ABOUT THE AUTHOR

...view details