దిల్లీలో ఇవాళ 293 కేసులు
దేశ రాజధాని దిల్లీలో ఇవాళ ఒక్కరోజే కొత్తగా 293 కరోనా కేసులు గుర్తించారు అధికారులు. వీటితో కలిపి ఆ రాష్ట్రంలో మొత్తం కొవిడ్-19 కేసుల సంఖ్య 2,918కి చేరాయి.
23:05 April 26
దిల్లీలో ఇవాళ 293 కేసులు
దేశ రాజధాని దిల్లీలో ఇవాళ ఒక్కరోజే కొత్తగా 293 కరోనా కేసులు గుర్తించారు అధికారులు. వీటితో కలిపి ఆ రాష్ట్రంలో మొత్తం కొవిడ్-19 కేసుల సంఖ్య 2,918కి చేరాయి.
21:13 April 26
కశ్మీర్లో 7 మరణాలు
ఇప్పటికే లక్షలాది మందిని పొట్టనబెట్టుకున్న కరోనా మహమ్మారి తాజాగా.. కశ్మీర్లో ఓ నిండు గర్భిణిని బలితీసుకుంది. దీంతో రాష్ట్రంలో మొత్తం కొవిడ్-19 కేసుల సంఖ్య 7కు చేరింది.
19:35 April 26
మహాలో ఇవాళ మరో 440..
దేశంలో కరోనా తీవ్రంగా మహారాష్ట్రలో ఇవాళ 440 మంది కరోనా బారిన పడ్డారు. మొత్తం కేసుల సంఖ్య 8068కి చేరింది. మరో 19 మంది మరణించగా.. మొత్తం మరణాలు 342కు చేరాయి. ఇవాళ మరో 112 మంది డిశ్చార్జి అయ్యారు.
11:29 April 26
జీవనశైలిలో కరోనా మార్పు తెచ్చింది
జీవనశైలి, పని విధానంలో కరోనా అనేక మార్పులు తీసుకొచ్చినట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఒకప్పుడు మాస్కు వేసుకుంటే వ్యాధిగ్రస్తుడిగా చూసేవారని, ఇప్పుడు ప్రతిఒక్కరు మాస్కు ధరిస్తున్నట్లు వివరించారు. రోగనిరోధక శక్తి పెంచుకునేందుకు ప్రతిఒక్కరూ పండ్లు తినాలని చెప్పారు మోదీ. ప్రతిఒక్కరికీ అన్నం పెట్టేందుకు రైతులు శ్రమిస్తున్నారన్నారు మోదీ..
11:24 April 26
అనేక దేశాలకు ఔషధాలను అందించాం: ప్రధాని
విపత్తు సమయంలో ప్రపంచ మానవాళి పట్ల భారత్ మానవతా దృక్పథంతో వ్యవహరించినట్లు ప్రధాని మోదీ చెప్పారు. ఔషధాలను అనేక దేశాలకు అందించినట్లు చెప్పారు. ఈ గొప్పతనమంతా భారతీయులదే అన్నారు. కరోనా వైరస్ మన జీవితాల్లో అనేక మార్పులు తెచ్చిందన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి కరోనాను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. కరోనా కట్టడిలో ఆయుర్వేదం కూడా మంచి ఫలితాలను ఇస్తున్నట్లు చెప్పుకొచ్చారు మోదీ. ప్రపంచమంతా మన యోగాను గుర్తించిందన్నారు.
11:19 April 26
రైల్వే సిబ్బంది సేవలు ప్రశంసనీయం
కరోనా విపత్తు వేళ రైల్వే సిబ్బంది సేవలు ప్రశంసనీయమన్నారు ప్రధాని. ప్రజలకు ఏం చేయాలనే దానిపై ఆలోచిస్తున్నట్లు చెప్పారు. కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానికసంస్థలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయన్నారు. కరోనా రహిత భారత్ కోసం వైద్యులు, వైద్యసిబ్బంది రేయింబవళ్లు శ్రమిస్తున్నట్లు పేర్కొన్నారు ప్రధాని మోదీ. రోజువారీ ఆదాయంతో బతికే ఆటో డ్రైవర్లు, కూలీల పరిస్థితి దయనీయంగా మారిందని వారిని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు ప్రధాని మోదీ.
11:14 April 26
కేంద్రం, రాష్ట్రాల సమన్వయం అద్భుతం
విపత్తు సమయంలో కేంద్రం, రాష్ట్రాలు కలిసి అద్భుతంగా పనిచేస్తున్నాయన్నారు ప్రధాని మోదీ. ప్రభుత్వం చేపట్టిన ప్రతి కార్యక్రమానికి ప్రజలు బాసటగా నిలిచారన్నారు. స్వచ్ఛ భారత్, శౌచాలయాల నిర్మాణాల్లోనూ ప్రజలు స్పందన అద్భుతం అన్నారు. వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, పోలీసులు నిరంతరం శ్రమిస్తున్నారన్నారు.
11:04 April 26
మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా జాతినుద్దేశించి ప్రసంగిస్తున్నారు ప్రధాని నరేంద్రమోదీ. కరోనాపై పోరు సవ్యమైన దిశలో సాగుతోందని చెప్పారు. ఈ పోరాటంలో ప్రతి పౌరుడు ఓ సైనికుడేనని అభిప్రాయపడ్డారు.
కరోనాపై సమరానికి ప్రజలే నాయకత్వం వహిస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు. గల్లీ నుంచి దిల్లీ వరకు ప్రతి ఒక్కరూ లాక్‌డౌన్ పాటిస్తున్నారన్నారు. కరోనాపై యుద్ధంలో ప్రపంచ దేశాలకు భారత్ పౌరులు స్ఫూర్తిగా నిలుస్తున్నట్లు చెప్పారు. కష్టసమయంలో ఎంతోమంది దాతలు పేదలకు అండగా నిలుస్తున్నారన్నారు. కరోనాపై సమరంలో ఉద్యోగులు తమ జీతాలు, పింఛన్లలో కొంతమొత్తం త్యాగం చేసినట్లు చెప్పారు.
09:08 April 26
చెన్నైలో ఇవాళ్టి నుంచి మూడ్రోజులపాటు పూర్తిస్థాయిలో లాక్‌డౌన్
ఈనెల 29 వరకు ఉ.6 నుంచి సా.9 వరకు పూర్తిస్థాయి లాక్‌డౌన్
08:42 April 26
మహారాష్ట్రలో ఇవాళ 440 కరోనా కేసులు.. 19 మరణాలు
దేశంలో కరోనా విజృంభణ మరింత తీవ్రమైంది. గత 24 గంటల్లో 49 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 1,990 మంది వైరస్ బారిన పడ్డారు. కేంద్ర ఆరోగ్య శాఖ ఈమేరకు వెల్లడించింది.