భారత్‌లో కొవిడ్-19 మహమ్మారి విజృంభిస్తోంది. 24 గంటల్లో రికార్డు స్థాయిలో 8,380 మందికి వైరస్ సోకింది. మరో 193 మంది వైరస్‌కు బలయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. మొత్తం మృతుల సంఖ్య 5,164 కు పెరిగింది.
దేశంలో 1.82లక్షలు దాటిన కరోనా కేసులు - covid latest news india
దేశంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 8,380 మందికి కొత్తగా వైరస్ సోకినట్లు నిర్ధరణ అయ్యింది. ఇప్పటివరకు 24 గంటల్లో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. మరో 193 మంది కొవిడ్ ధాటికి ప్రాణాలు కోల్పోయారు.
కరోనా కలకలం: దేశంలో 24 గంటల్లోనే 8వేలకుపైగా కొత్త కేసులు
కొత్త కేసులతో కలిపి దేశవ్యాప్తంగా కొవిడ్-19 బాధితుల సంఖ్య లక్షా 82 వేలు దాటింది. కేసుల సంఖ్య అత్యధికంగా ఉన్న దేశాల్లో భారత్ తొమ్మిదో స్థానంలో ఉంది.
దేశంలో కరోనా తీవ్రంగా ఉన్న మహారాష్ట్రలో ఇప్పటివరకు 2,197 మంది మరణించారు. అక్కడ బాధితుల సంఖ్య 65,168కి చేరింది. గుజరాత్లో 16,343, మధ్యప్రదేశ్‌లో 7,891మంది వైరస్ బారినపడ్డారు.