తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కర్తార్​పుర్​పై రాజీ- భద్రతే ప్రధానంగా భారత్ వాణి

కర్తార్​పుర్​ నడవాపై భారత్​ లేవనెత్తిన అంశాలపై పాక్​ సానుకూలంగా స్పందించింది. భారత​ వ్యతిరేక చర్యలను అనుమతించబోమని పాక్​ ప్రతినిధులు స్పష్టం చేశారు. ఇరు దేశాల అధికారుల మధ్య అఠారీ-వాఘా సరిహద్దులో జరిగిన సమావేశంలో పలు కీలక విషయాలపై చర్చించారు.

కర్తార్​పుర్

By

Published : Jul 14, 2019, 5:36 PM IST

కర్తార్​పుర్​ నడవా నిర్మాణంలో సమస్యలపై భారత్​-పాక్​ ప్రతినిధుల చర్చలు ఫలప్రదంగా ముగిశాయి. భారత విదేశాంగ సంయుక్త కార్యదర్శి ఎస్​సీఎల్​ దాస్​, పాక్​ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మహ్మద్​ ఫైసల్​ నేతృత్వంలో రెండు దేశాల ప్రతినిధులు అఠారీ-వాఘా సరిహద్దులో సమావేశమయ్యారు. కర్తార్​పుర్​ నడవాపై ఇరు దేశాల ప్రతినిధులు భేటీ కావటం ఇది రెండోసారి.

సమావేశంలో 80 శాతం ప్రతిపాదనలను ఇరుదేశాలు అంగీకరించినట్లు ఫైసల్​ తెలిపారు. మిగిలిన అంశాలపై చర్చించేందుకు మరోసారి భేటీ అయ్యే అవసరం ఉందన్నారు. భారత్​ లేవనెత్తిన అంశాలకు పాక్​ సానుకూలంగా స్పందించిందని మన విదేశాంగ శాఖ అధికారిక ప్రకటనలో తెలిపింది.

ఎస్​సీఎల్​ దాస్​

"వీసా లేని ప్రయాణానికి అంగీకారం కుదిరింది. మొదటగా రోజుకు 5వేల మంది ప్రయాణించేందుకు అనుమతి ఉంటుంది. ఈ సంఖ్య భవిష్యత్తులో తప్పక పెరుగుతుంది. మరో ముఖ్యమైన విషయం... 365 రోజులు రాకపోకలు ఉంటాయి. మేము చర్చించిన అంశాల్లో భద్రత అతి ముఖ్యమైనది. యాత్రికులకు సరైన భద్రత కల్పించేందుకు ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయి."

-ఎస్​సీఎల్​ దాస్​, విదేశాంగ శాఖ సంయుక్త కార్యదర్శి

నిర్మాణం, కమిటీలు, యాత్రికులకు సంబంధించిన అనేక అంశాల్లో రెండు దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది.

  • కర్తార్​పుర్​ వరకు భారత్​​ నుంచి 4 వరుసల రహదారి, పాక్​ నుంచి 2 వరుసల మార్గం నిర్మాణం
  • భారత్​లో నిర్మించే వంతెనను అనుసంధానించేలా పాక్​ నిర్మాణం చేపట్టాలి
  • భారత్​ పాస్​పోర్టు ఉన్నవారు, జాతీయత కలిగిన వారికి వీసా లేని ప్రయాణం
  • ప్రత్యేక సందర్భాల్లో రోజుకు 10 వేల యాత్రికులకు అనుమతి
  • గురునానక్​ 550 జయంతి (నవంబర్​ 12) నాటికి పనుల పూర్తి
  • నడవాలో భారత్​ వ్యతిరేక చర్యలు పూర్తిగా నిషిద్ధం

చావ్లాపై వేటు

పాకిస్థాన్​ సిక్కు గురుద్వార ప్రబంధక్ కమిటీలో ఖలిస్థానీ వేర్పాటువాది గోపాల్​ సింగ్​ చావ్లా ఉండడంపై భారత్​ అభ్యంతరం లేవనెత్తగా దాయాది దేశం తలొగ్గింది. ప్రతినిధుల బృందం నుంచి అతడ్ని తప్పించింది.

ప్రముఖ గురుద్వారా దర్బార్​ సాహిబ్​ను సిక్కు యాత్రికులు దర్శించేందుకు భారత్​లోని గురుదాస్​పుర్ నుంచి కర్తార్​పుర్​ వరకు నడవా నిర్మించేందుకు గత నవంబర్​లో రెండు దేశాలు అంగీకరించాయి. గురుదాస్​పుర్​ నుంచి సరిహద్దు వరకు భారత్​, సరిహద్దు నుంచి కర్తార్​పుర్​ వరకు పాకిస్థాన్​ నిర్మాణ బాధ్యతలు చూసుకుంటాయి.

ఇదీ చూడండి: కర్తార్​పుర్​ నడవాపై భారత్​-పాక్​ చర్చలు

ABOUT THE AUTHOR

...view details